Type Here to Get Search Results !

No title

APTEACHERS
ఎం.ఎల్.సి ఎన్నికలలో యూటీఎఫ్ అభ్యర్దుల విజయానికి సహకరించాలని వినతి.
రానున్న ఫిబ్రవరి మార్చ్ నెలలలో 3 టీచర్ 3 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలలో ఎన్నికలు జరగనున్నాయి. యూటీఎఫ్ బలం తో గెలిచినా ఎం.ఎల్.సి లు ఉపాధ్యాయ, ఉద్యోగుల ఉద్యమాలకు మరియు విద్యారంగం ప్రభుత్వ రంగం ఎంతో అండగా ఉంటున్నారు. ...sahakarinc సహకరించండి
జిల్లా ఉపాధ్యక్షుడిగా కే. గంగాధర్
ఆదివారం తేది. 2.12.2012 నాడు నక్కపల్లి లో జరిగిన ఆంద్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా మహాసభలలో జిల్లా యూ.టి.ఎఫ్. నూతన కార్య వర్ఘం ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో అచ్యుతాపురం మండలం లో దోసూరు లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కే. గంగాధర్ ను జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏక గ్రీవం గా ఎన్నుకొన్నారు. ఈ సందర్భం గా యూ.టి.ఎఫ్ జిల్లా నూతన ఉపాధ్యక్షుడిని అచ్యుతాపురం మండలం యూ.టి.ఎఫ్ గౌరవ అధ్యక్షుడు జే. ప్రసాదరావు, అధ్యక్షుడు ఆర్. రవి కుమార్, ప్రదాన కార్యదర్శి జాకీర్ అలీ లు అభినందలను తెలిపారు.  ఈ అభినందన కార్యక్రమంలో కే. గంగాధర్  మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి మరింతగా కృషి చేస్తామని పేర్కొన్నారు. వేసవి సెలవులలో శిక్షణా కాలానికి సంబంధించి సంపాదిత సెలవు మంజూరు కై జిల్లా విద్యా శాఖాధికారి మరియు ఆర్.వీ ఎం. ప్రాజెక్ట్ అధికారికి ప్రాతినిధ్యం ఇచ్చినట్లు తెలుపారు. అదే విధం గా డి.ఎస్.సి 2008 హామీ పత్రాల ఉపాధ్యాయుల కు తక్షణమే రెగ్యులర్ స్కేల్ మంజూరు కొరకు యూ.టి.ఎఫ్ డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు ప్రాతినిధ్యం చేసిందని పేర్కొన్నారు. సానుకూల ఉత్తర్వులు త్వరలో రావచ్చునని తెలిపారు.

Top Post Ad

Bottom Post Ad