EBC NESTHAM Scheme Guidelines YSR EBC NESTHAM Details in Telugu


EBC Nestham Scheme Full Details. B.C. Welfare Department has released the Guidelines for EBC NESTHAM Guidelines for  Inclusion in the Budget for the Financial Year 2021-22 “EBC NESTHAM” for EBC communities for granting Rs.15,000/- per annum for a period of three years amounting to Rs.45,000/- to financially empower EBC Women (other than SC/ST/BC/Kapu/Minority communities) aged above 45 years and below 60 years for enhancing their livelihood opportunities and living standards – Orders -Issued.

EBC NESTHAM Scheme Guidelines YSR EBC NESTHAM Details in Telugu

Details of EBC NESTHAM in Telugu as per G.O.MS.No. 2 Dated: 20-04-2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నటువంటి ఈబీసీ కమ్యూనిటీ వారందరిని ఆర్థిక వృద్ధి లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం EBC నేస్తం అనే పథకం ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఈ సంవత్సరం 2021-22 నుంచి కొత్త దరఖాస్తులను ఆహ్వానించడం జరుగుతుంది. వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం లానే ఈ బీసీ కమ్యూనిటీ లో ఉండే మహిళలకు ఆర్థికంగా చేయూత ఇవ్వటమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం . ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 15 వేల రూపాయలు చొప్పున మొత్తం మూడు విడతలుగా అనగా మూడు సంవత్సరాలకు 45 వేల రూపాయలు ఆర్థిక లబ్ధి అందుతుంది .

2021-22 సంవత్సర ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ముందుగా ఉన్న వారి అర్హత, అనర్హతలను మరియు కొత్తగా పథకానికి అర్హత ప్రమాణాలతో కూడిన గైడ్ లైన్స్ ను ప్రతి జిల్లా కలెక్టర్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, DBCSS Ltd. వారికి MD, APS EBC WDC ( ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ బీసీ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ) వారు అందించడం జరిగింది. అందులో తెలియజేసిన పథకం యొక్క అర్హత ప్రమాణాలు, టైం లైన్ లను ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

పథకం పేరు : ఈబీసీ నేస్తం
పథకం ఉద్దేశం : రాష్ట్రంలో 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న ఈబీసీ కమ్యూనిటీ మహిళలందరికీ ఆర్థిక వృద్ధి లోకి తీసుకురావడం
లబ్ది : సంవత్సరానికి 15000 అలా మూడు విడతలుగా మొత్తం మూడు సంవత్సరాలకు 45 వేల రూపాయలు అకౌంట్ లో జమ
2021-22 బడ్జెట్ : 1810 కోట్ల నుండి 2011 కోట్లు.

అర్హతలు :
  • 1.EBC కమ్యూనిటీకి చెందిన మహిళలు అయి ఉండాలి.
  • 2.వైయస్సార్ చేయూత, కాపు నేస్తం లో కవర్ అయినా ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనారిటీ వారు అనర్హులు.
  • 3. అర్హులైన మహిళ పేరు మీద ఆధార్ కార్డు ఉండాలి
  • 4. అర్హులైన మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉండాలి
  • 5. కుటుంబ ఆదాయం రూరల్ లో అయితే నెలకు 10,000 అర్బన్ లో అయితే నెలకు 12,000 మించకూడదు ( కుటుంబం అనగా తండ్రి తల్లి ఆధారపడిన పిల్లలు అని అర్థం )
  • 6. కుటుంబ మొత్తం భూమి మెట్ట భూమి 10 ఎకరాల లోపు లేదా పల్లం భూమి మూడు ఎకరాల లోపు లేదా మెట్ట మరియు పళ్ళ మొత్తం కలిపి పది ఎకరాల లోపు ఉండాలి
  • 7. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉండకూడదు ( పారిశుద్ధ్య కార్మికుల కు మినహాయింపు)
  • 8.ఆటో, టాక్సీ,టాక్టర్ మినహా కుటుంబంలో ఎవరి పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు
  • 9. కుటుంబంలో ఎవరూ కూడా ఇన్కమ్ టాక్స్ కట్టకూడదు
  • 10. మునిసిపాలిటీ లో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ స్థలం ఉండకూడదు
  • 11. తేదీ 29.9.2021 నాటికి 45 సంవత్సరాలు నిండి ఉండాలి 60 సంవత్సరాల లోపు ఉండాలి.
  • వయసు ధ్రువీకరణ పత్రాలు : ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ / డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ / టెన్త్ మార్క్స్ మెమో / ఓటర్ ఐడి కార్డ్
అర్హత గుర్తింపు :
1. గ్రామ వార్డు వాలంటీర్ వారు డోర్ టు డోర్ ( ఇంటింటా ) వెళ్లి మొబైల్ అప్లికేషన్ నందు సర్వే చేసి అర్హులకు గుర్తిస్తారు. అర్హులను గుర్తించి ఏ సమయంలో వాలంటే వారికి పైన తెలిపిన అర్హతలు అన్నీ కూడా తెలిసి ఉండాలి
2. వాలంటీర్ వారు సర్వే చేయు సమయంలో అడుగు సమాచారం
1. లబ్ది దారు పేరు
2. లబ్ది దారు ఆధార్ నెంబర్
3. కుటుంబ పెద్ద పేరు
4. కుటుంబ పెద్ద ఆధార్ నెంబరు
5. కులము
6. పుట్టిన తేదీ ప్రూఫ్
7. కుటుంబ ఆదాయము
8. బ్యాంకు అకౌంట్ నెంబరు/ IFSC కోడ్ / బ్యాంకు పేరు
9. బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
10. అద్దె వాహనాలు కాకుండా నాలుగు చక్రాల వాహనం ఉంటే నెంబరు
11. భూమి వివరాలు ( మెట్ట పల్లము వివరాలు )
12. మునిసిపాలిటీ లో భూమి ఉన్నట్లయితే వాటి వివరాలు
13. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉంటే వారి వివరాలు
14. లబ్ధిదారుని ఫోన్ నెంబర్

కావాల్సిన డాక్మెంట్స్ :
1. ఇంట్లో ఉన్న అందరి ఆధార్ కార్డ్స్
2. క్యాస్ట్ సర్టిఫికెర్
3. ఇన్కమ్ సర్టిఫికెట్
4. రైస్ కార్డు
5. బ్యాంకు బుక్
6. ఆధార్ అప్డేట్ హిస్టరీ
7. EBC సర్టిఫికెట్ కావలెను.
8. భూమి ఉంటే నకలు
9. మునిసిపాలిటీ లో భూమి ఉంటే వాటి నకలు
10. అప్లికేషన్ ఫారం
11. ఓటర్ కార్డు / SSC / DOB / ఇంటిగ్రాటెడ్ సర్టిఫికెట్

ఆమోదం :
గ్రామ వార్డు వాలంటీర్ వారు ఇంటింటా మొబైల్ అప్లికేషన్ నందు సర్వే చేసిన వివరాలు సంబంధిత వెల్ఫేర్ అసిస్టెంట్ వారు ధ్రువీకరించాల్సి ఉంటుంది. ధ్రువీకరణ పూర్తి అయిన తరువాత వివరాలను వెబ్ అప్లికేషన్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా MPDO/MC వారికి పంపించాలి. అక్కడ పరిశీలన పూర్తి అయిన తరువాత సంబంధిత జిల్లా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వారికి ఫార్వర్డ్ చేస్తారు. వారు ఆమోదం కొరకు సంబంధిత జిల్లా కలెక్టర్ వారికి పంపిస్తారు. అక్కడ నుండి మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఈ బీసీ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారికి అమౌంట్ శాంక్షన్ కోసం కలెక్టర్ వారు ఫార్వర్డ్ చేస్తారు . అక్కడ నుండి కార్పొరేషన్ వైస్ గా బిల్లుల ప్రిపరేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ CFSS వారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. గ్రామ వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కొరకు అర్హుల జాబితాను హ్యాంగ్ చేయడం జరుగుతుంది.


పేమెంట్ ప్రాసెస్ :
1. మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ బీసీ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వారి వద్ద శాంక్షన్ పొందిన బ్యాంకు లబ్ధిదారునికి ఖాతాలో ప్రభుత్వం నిర్ణయించిన రోజు అమౌంట్ జమ అవుతుంది.
2. లబ్ధిదారులు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు ఎస్ఎంఎస్ అనేది వస్తుంది జమ అయినట్టు
3. పేమెంట్ రసీదులు సచివాలయాల్లో జనరేట్ అవుతాయి మరియు గౌరవ ముఖ్యమంత్రి సందేశం లెటర్ను గౌరవ గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా లబ్ధిదారులకు అందజేయాలి
4. పేమెంట్ అక్నౌలెడ్జిమెంట్ అనేది సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వారి వద్ద జరుగును. లబ్ధిదారులు బయోమెట్రిక్ వేసి పని పూర్తి చేయాలి.
ఈబీసీ నేస్తం 2021-22 టైమ్ లైన్ :
01-10-2021 నుంచి 07-10-2021 :
మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ ఈ బీసీ కార్పొరేషన్ వారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎంపీడీవో,మున్సిపల్ కమిషనర్ వారికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళల సమాచారం SOP పై ట్రైనింగ్ నిర్వహిస్తారు. అందులో ముఖ్యంగా 45 నుంచి 60 సంవత్సరాల ఈ బిసి మహిళల లో చనిపోయిన వారిని తీసివేయుట, 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారిని తీసి బయట, కొత్తగా అర్హులైన వారిని గుర్తించడం జరుగుతుంది .

08-10-2021 నుంచి 10-10-2021 :
అర్హత ప్రమాణాలకు అనుగుణంగా వాలంటీర్ వారు ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలి, ఆ డేటా మొబైల్ అప్లికేషన్ లో నమోదు చేయాలి, నమోదు చేసిన సమాచారాన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ వారు పరిశీలన చేసిన తర్వాత సంబంధిత ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ వారికి ఫార్వర్డ్ చేయాలి. మొబైల్ అప్లికేషన్ ను వారు APCFSS డెవలప్ చేస్తారు.

11-10.2021 నుంచి 13-10-2021 :
MPDO/MC వారు సిద్ధం చేసిన లిస్టు ప్రకారం సోషల్ ఆడిట్ టీమ్ వారు ఆడిట్ చేస్తారు .

14-10-2021 నుంచి 16-10-2021 :
ఆడిటర్ రిపోర్టు ప్రకారం అనర్హుల పేరును సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ వారు తొలగించగా మిగిలిన లిస్టులను సచివాలయంలో అభ్యంతరాల స్వీకరణ కొరకు హ్యాంగ్ చేస్తారు.

17-10-2021 నుంచి 18-10-2021 :
అభ్యంతరాల స్వీకరణ అయిన తరువాత MPDO/MC వారు లిస్టులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, DBCSCS Ltd.వారికి ఫార్వర్డ్ చేయాలి.

19-10-2021 నుంచి 21-10-2021:
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, DBCSCS Ltd. వారు జిల్లా కలెక్టర్ వారి నుంచి ఆమోదం తీసుకొని వాటిని ఈ బీసీ నేస్తం పోర్టల్ ద్వారా గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ వారికి ఫార్వర్డ్ చేయాలి.

ప్రభుత్వం నిర్ణయించిన తేదీనాడు లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది
Previous Post Next Post

Contact Form