AP Employees News Head Lines 27th August 2022

సీఎంవోకు ఉపాధ్యాయుల బదిలీల దస్త్రం*

*🌻ఈనాడు, అమరావతి:* ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహణకు మంత్రి బొత్స సత్యనారాయణ ఆమోదం తెలపడంతో సంబంధిత దస్త్రం ముఖ్య మంత్రి కార్యాలయానికి చేరింది. బదిలీల్లో ఈ ఏడాది కొత్త సవరణ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు, ప్రధానోపాధ్యాయులు అయిదేళ్లు సర్వీసు పూర్తి చేసుకుంటే తప్పనిసరి బదిలీ ఉండగా... దీన్ని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు అయిదేళ్లుగా మార్పు చేశారు. మిగతా పాయింట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతు బద్ధీకరణ ప్రక్రియ పూర్తయ్యాక బదిలీలకు ఆదేశాలు వచ్చే అవకాశముంది.

ఓపీఎస్‌ అమలు చేస్తే.. కేంద్రం మా నట్లు బిగిస్తుంది!*

*రాష్ట్రానికి  రావాల్సిన నిధులు ఆగిపోతాయి*
*ప్రపంచ దేశాలన్నీ ఓపీఎస్‌ను రద్దు చేస్తున్నాయి*
*అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ఎందుకొచ్చారు?*
*సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బుగ్గన*
*జగన్‌ హామీనే అమలుచేయాలంటున్నామన్న సంఘాలు*
*ఆ రోజు అవగాహన లేక హామీ ఇచ్చామన్న మంత్రులు*
*జీపీఎస్‌పై మెడికల్‌ బెనిఫిట్లూ ఇస్తామని ప్రతిపాదన*
*మంత్రులు, సంఘాల మధ్య తీవ్ర వాదోపవాదాలు*
 
*🌻వజయవాడ, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి)*: ‘పాత పెన్షన్‌ పథకం(ఓపీఎస్)ను అమలు చేస్తే కేంద్రప్రభుత్వం మా నట్లు, బోల్టులు బిగించేస్తుంది. రాష్ట్రానికి   రావాల్సిన నిధులు ఆగిపోతాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాలు ఈ రోజు సీపీఎస్‌ రద్దు చేయవచ్చు. అవన్నీ రాజకీయ కారణాలతో చేసినవి. తర్వాత వచ్చే ప్రభుత్వం, లేదా ఆ ప్రభుత్వాలే మళ్లీ సీపీఎస్‌ అమలు చేయక తప్పదు. నేను ప్రపంచ దేశాలు తిరిగాను. మీకంటే ఎక్కువ జ్ఞానం నాకు ఉంది. ప్రపంచ దేశాలన్నీ నూతన పెన్షన్‌ విధానం దిశగా అడుగులు వేస్తున్నాయి. జీపీఎ్‌సపై తప్పితే మరో మాట లేదు’ అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తేల్చి చెప్పేశారు. మంత్రి తీరుతో సీపీఎస్‌ ఉద్యోగ నేతలు విస్తుపోయారు. శుక్రవారం విజయవాడలోని మంత్రి బొత్స నివాసంలో ఆర్థిక మంత్రి బుగ్గనతో ఏపీసీపీఎస్ఈఏ,ఏపీసీపీఎస్ఈఏయూఎస్‌ సంఘాలు భేటీ అయ్యాయి. జీపీఎ్‌సపై మాట్లాడబోమని, ఓపీఎ్‌సపై మాత్రమే చర్చిస్తామని ఉద్యోగ నేతలు స్పష్టం చేశారు. రాజస్థాన్‌, ఛత్తీస్గఢ్‌లో పరిస్థితులను అధ్యయనం చేశామని వారు అనడంతో... మీరు రాష్ర్టాల్లో అధ్యయనం చేశారేమో.. నేను ప్రపంచంలోనే అధ్యయనం చేశానని బుగ్గన సమాధానమిచ్చారు. ఒక దశలో సహనం నశించిన బుగ్గన... మీరు ప్రభుత్వ ఉద్యోగంలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఓపీఎస్‌ పునరుద్ధరించడం అసంభవమన్న సంకేతాలను ఇచ్చారు. రాజస్థాన్‌, చత్తీస్గఢ్‌ రాష్ర్టాలకు రాష్ర్టాలకు కేంద్రం ఎలాంటి నట్లు బిగించిందో తమకు తెలుసన్నారు. జీపీఎ్‌సకు కాస్త పైన... ఓపీఎ్‌సకు కాస్త కిందకు రావాల్సిందిగా మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. సీఎం ఇచ్చిన హామీనే అమలు చేయాలని నేతలు కోరగా... హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అప్పుడు అవగాహన లేదని, ప్రస్త్తుతం ఆర్థిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని బొత్స అన్నారు. తాము ఓపీఎ్‌సకు మాత్రమే కట్టుబడి ఉన్నామని ఉద్యోగ సంఘాల నేతలు ముక్తకంఠంతో చెప్పారు. దీంతో చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి.

*మళ్లీ పాత పాటే పాడుతున్నారు*

ఆర్థిక మంత్రి బుగ్గన వచ్చారు కాబట్టి ఏదైనా తీపి కబురు చెబుతారేమోనని చాలా ఆశగా వచ్చాం. గతంలో ప్రభుత్వం ఏం చెప్పిందో ఇప్పుడు కూడా అదే చెప్పింది. ఒక అడుగు ముందుకు వేసి హెల్త్‌ బెనిఫిట్స్‌ ఇస్తామని చెప్పింది.
- రామాంజనేయులు, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు

*మూడేళ్లుగా ఎందుకు తిప్పుకొంటున్నారు?*
ఓపీఎస్‌ అమలు సాధ్యం కాకపోతే మూడు సంవత్సరాలు ఎందుకు మీ వెంట తిప్పుకున్నారు. పాదయాత్రలో సీపీఎస్‌ రద్దు చేస్తామంటే జగన్‌ వెంట తిరిగాం. ఇప్పుడు అన్యాయమైపోయాం. సెప్టెంబరు 1న చలో విజయవాడ కార్యక్రమం కొనసాగిస్తాం. జీపీఎ్‌సపై చర్చలకు రాబోమని మంత్రులకు స్పష్టంచేశాం.
*▪️రంగలి అప్పల్రాజు, ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు*

*సీఎం ఇంటి ముట్టడి నిర్వహించి తీరతాం*
సీపీఎస్‌ రద్దుపై చర్చలు విఫలమయ్యాయి. సెప్టెంబరు 1న సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. పాతపెన్షన్‌ విధానంపై మంత్రులు చర్చిస్తారనుకుంటే మళ్లీ జీపీఎ్‌సపైనే మాట్లాడారు. ఓపీఎ్‌సపై అయితేనే మాట్లాడతామని, జీపీఎస్పై చర్చలకు మరోసారి పిలవొద్దని చెప్పాం.
*▪️ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం దాస్‌*

*బహిరంగ సభకు గ్రౌండ్‌ ఇవ్వలేం*
చలో విజయవాడలో భాగంగా విజయవాడ శాతవాహన కాలేజీ గ్రౌండ్స్‌లో సెప్టెంబరు 1న బహిరంగ సభ నిర్వహించాలని ఏపీసీపీఎ్‌సఈఏ నిర్ణయించింది. కాలేజీ యాజమాన్యం నుంచి అనుమతులు తీసుకుని అద్దె కూడా చెల్లించారు. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో... సభకు గ్రౌండ్‌ ఇవ్వలేమని, డబ్బులు తిరిగి తీసుకోవాలని కాలేజీ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. దీంతో విజయవాడ నగరంలో ఇతర మైదానాలను నిర్వాహకులు పరిశీలిస్తున్నారు.


*అడ్డుకుంటే మమ్మల్ని మేం శిక్షించుకుంటాం: ఏపీసీపీఎస్ఈఏ*
చలో విజయవాడను ప్రభుత్వం అడ్డుకుంటే విజయవాడ వేదికగానే తమను తాము శిక్షించుకుంటామని ఏపీసీపీఎ్‌సఈఏ నేతలు ప్రకటించారు. చెప్పులతో కొట్టుకోవటం, గుండు గీయించుకోవటం, కొరడాలతో కొట్టుకోవటం చేస్తామే తప్ప.. సర్కారు హెచ్చరికలకు లొంగేది లేదని స్పష్టం చేశారు.

చలో విజయవాడకు అడ్డంకులు

*🌻వజయవాడ న్యూస్టుడే :* కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) రద్దు డిమాండ్తో సెప్టెంబరు 1న సీఎం ఇల్లు ముట్టడి, చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాలు చేపడుతున్న దృష్ట్యా విజయవాడ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులకు ఆయా కార్యక్రమాలకు వెళ్లవద్దంటూ నోటీసులు జారీ చేశారు. విజయవాడ నగరంలో 144 సెక్షన్, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉండటంతో ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. విజయవాడలోని లాడ్జీల్లో తనిఖీలు చేప ట్టారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని గవర్నర్పేట, సూర్యారావుపేట, వన్లైన్, సత్యనారాయణపురం, మాచవరం, పటమట, కృష్ణలంక, భవానీపురం తదితర | పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటళ్లు, లాడ్జీలను విస్తృతంగా పరిశీలించారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ఎవరైనా ముందస్తు బుకింగ్లు చేసుకున్నారా అని ఆరా తీశారు. వారి వివరాలు, చరవాణి నంబర్లను సేకరించారు. చలో విజయవాడకు పోలీసు అనుమతి లేదని ఎవరైనా పాల్గొనేందుకు విజయవాడకు వస్తే వారిపై చర్యలు తీసు కుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు.

దేశంలో 22 నకిలీ విశ్వవిద్యాలయాలు

*ప్రకటించిన యూజీసీ* 
*జాబితాలో ఏపీకి చెందిన రెండు విద్యా సంస్థలు*
*🌻ఈనాడు, దిల్లీ*: దేశ వ్యాప్తంగా 22 విశ్వవిద్యా లయాలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నా యని, అవన్నీ నకిలీవి అని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) కార్యదర్శి ప్రొఫెసర్ రజనీష్ జైన్ ప్రకటించారు. యూజీసీ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్న ఆయా వర్సిటీలకు డిగ్రీ పట్టాలిచ్చే అధికారం లేదని తేల్చిచెప్పారు. యూజీసీ ప్రకటించిన నకిలీ విశ్వవిద్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్లోని క్రైస్ట్ న్యూటెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ (కాకుమాను వారితోట, గుంటూరు), బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా (ఎన్టీవోస్ కాలనీ, విశాఖపట్నం)లు కూడా ఉన్నాయి. అత్యధికంగా ఢిల్లీలో 8 నకిలీ వర్సిటీలు ఉన్నట్టు యూజీసీ తెలిపింది.

వార్షిక ఆరోగ్య పరీక్షలు ప్రారంభించాలి

*ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్*

*🌻ఈనాడు, అమరావతి:* ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీవెంటనే వార్షిక ఆరోగ్య పరీక్షలు జరపాలని ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2019 ఆగస్టులో జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో అంగీకరించినప్పటికీ... ఇప్పటి వరకు వార్షిక ఆరోగ్య పరీక్షల విధానం అమల్లోనికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రధాన కార్యాలయంలో సీఈఓ హరీంద్రప్రసాద్ అధ్యక్షతన మేనేజింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ "ఉద్యోగులకు స్మార్ట్ కార్డులు ఇంకా పూర్తిస్థాయిలో అందలేవు. నెట్వర్క్ ఆస్పత్రులకు వెంటనే బకాయిలు చెల్లించాలి. ఈహెచ్ఎస్ కింద చికిత్స అందించేందుకు నిరాకరిం చిన ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి. మెడికల్ రీఎంబర్స్మెంట్ పరిమి తిని రూ. రెండు లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని కోరుతున్నా. ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఓపీ ద్వారా బీపీ, షుగర్, ఇతర రుగ్మతల చికిత్స పొందే అవకాశాన్ని కల్పించాలి. ఆస్పత్రులపై ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక యాప్ ను రూపొందించాలి. ముఖ్యమైన చికిత్సలు అందించేం దుకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు సరిపోవడంలేదని ఆస్పత్రులు యాజమాన్యాలు చెబుతున్నాయి. వారితో సమావేశం ఏర్పాటు చేయాలి. అని పేర్కొన్నారు. ప్రభుత్వంతో సంప్రదించి సమస్యల పరిష్కారానికి అవ సరమైన చర్యలు తీసుకుంటామని సీఈఓ హరీంద్రప్రసాద్ హామీ ఇచ్చారని జేఏసీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. జేఏసీ అమరావతి భాగస్వామ్య సంఘాల నేతలు అల్ఫ్రెడ్, మల్లేశ్వరరావు, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఏ స్కూల్‌కు ఎంత మంది టీచర్లు?

*విద్యార్థుల సంఖ్య ఆధారంగా 31వ తేదీలోపు ఖరారు చేయండి*
*649 పాఠశాలల్లో విలీనం నిలిపివేత*
*పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు*

*🌻అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి):* పాఠశాలల్లో తరగతుల విలీనం నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఏ పాఠశాలకు ఎంతమంది టీచర్లు అవసరమవుతారో ఖరారు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 31 నాటికి పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఈ లెక్క తేల్చాలని స్పష్టం చేసింది. ఇది పాఠశాల, సబ్జెక్టు, కేటగిరీ వారీగా ఉండాలని సూచించింది. దీనినిబట్టి 31వ తేదీనాటికి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎంత ఉందనే వివరాలను ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకుని, కొత్తగా తెచ్చిన హేతుబద్ధీకరణ విధానం ఆధారంగా టీచర్లను కేటాయించనున్నారు. 20 మంది విద్యార్థులే ఉంటే ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడిని ఇస్తారు. 98 కంటే తక్కువ మంది విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలకు స్కూల్‌ అసిస్టెంట్లను కేటాయించరు. అక్కడ 3 నుంచి 5 తరగతులతో పాటు 6 నుంచి 8 తరగతుల విద్యార్థులకు కూడా ఎస్జీటీలే బోధించాలి. ఈ విధానాలపై టీచర్లు నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఏకోపాధ్యాయ పాఠశాలలుండవని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదే పదే హామీలిచ్చినా ఇంతవరకూ దానిపై జీవో ఇవ్వలేదు. దీంతో 20 మంది విద్యార్థులుంటే అక్కడ సింగిల్‌ టీచర్‌ మాత్రమే ఉంటారు.

*విలీనంపై 1,399 అభ్యంతరాలు*
తరగతుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యాశాఖకు మొత్తం 1,399 అభ్యంతరాలు అందాయి. వాటిలో 820 అభ్యంతరాలు ఎమ్మెల్యేల నుంచి, 579 జిల్లా స్థాయి నుంచి వచ్చాయి. వాటిపై పరిశీలన చేసిన జిల్లా స్థాయి కమిటీలు 649 పాఠశాలల్లో విలీన ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించాయి. వీటిలో 380 ఎమ్మెల్యేలు అభ్యంతరాలు తెలిపిన పాఠశాలలున్నాయి. మరో 780 అభ్యంతరాలను విద్యాశాఖ పరిగణనలోకి తీసుకోలేదు. అంటే అక్కడ అభ్యంతరాలు లేవనెత్తినట్లుగా పాఠశాలలకు వెళ్లేదారిలో వాగులు, వంకలు లేవని, నిబంధనల ప్రకారం కిలోమీటరు పరిధిలోనే విలీనం చేసే పాఠశాలలు ఉన్నాయనేది జిల్లాస్థాయి కమిటీలు తమ పరిశీలనలో తేల్చాయి. దీంతో ఈ అభ్యంతరాలను పక్కన పెట్టారు.

మిలియన్‌’ సెగలు

*సర్కారును హడలెత్తిస్తున్న చలో విజయవాడ*
*ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నోటీసులు జారీ*
*బెజవాడ ప్రయాణాలపై తీవ్ర ఆంక్షలు*
*వాహనాలు తిప్పొద్దని ట్రావెల్స్‌కు హెచ్చరికలు*
*టీచర్లకు చేతినిండా పని కల్పించేలా ప్రణాళిక*
*కొత్తగా ఎడ్యూఫెస్ట్‌ నిర్వహిస్తామంటూ ప్రకటన*
*వారం పాటు తీరిక లేని షెడ్యూలు విడుదల*

*అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి*): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సీఎం ఇంటి ముట్టడి, ‘చలో విజయవాడ’ పిలుపు సర్కారును హడలెత్తిస్తోంది. గతేడాది విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయులు నిర్వహించిన పీఆర్‌సీ, సీపీఎస్‌ ధర్నాకు వచ్చిన స్పందన ప్రభుత్వాన్ని ఇప్పటికీ కలవరపాటుకు గురిచేస్తోంది. అప్పటి ధర్నాను తేలికగా తీసుకోవడం ఎంత తప్పో ఆ కార్యక్రమం అనంతరం గానీ తెలిసిరాలేదు. ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఏస్థాయిలో వ్యతిరేకత ఉందనే విషయాన్ని నాటి నిరసన ఎత్తిచూపింది. ఆ అనుభవం దృష్ట్యా ఇప్పుడు మరోసారి ఆ స్థాయి నిరసన జరగకూడదని భావిస్తున్న ప్రభుత్వం... వారం ముందునుంచే కఠిన ఆంక్షలకు దిగింది. జిల్లాల నుంచి విజయవాడకు ప్రయాణమయ్యే వారిపై నిఘా పెట్టింది. నెలాఖరున విజయవాడకు వాహనాలు తగ్గించాలని, ఒకవేళ తిప్పినా వారిలో ఎవరైనా ఉద్యోగులు ఉన్నట్లు అనుమానంగా ఉంటే తమకు సమాచారం ఇవ్వాలలని ప్రైవేటు ట్రావెల్స్‌కు జిల్లాల్లో ఎక్కడికక్కడ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా బస్సులు, వాహనాలు ఏర్పాటు చేయొద్దని స్పష్టం చేస్తున్నారు. రాయచోటి, పీలేరులో 28 నుంచి 1వరకూ వాహనాలు బయటకు తీయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే వాటిని సీజ్‌ చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఒకట్రెండు ట్రిప్‌ల కోసం చూసుకుంటే తర్వాత వాహనాలు నడపడం చాలా కష్టమవుతుందని యజమానులను హెచ్చరిస్తున్నారు.


మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు చలో విజయవాడకు వెళ్లకూడదని స్పష్టం చేస్తూ ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్రవ్యాప్తంగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఓవైపు ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త పనులు అప్పగించే పనిలో పడింది. ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 5వ తేదీ వరకు వారికి చేతినిండా పని ఉండేలా ‘ఎడ్యుఫెస్ట్‌-2022’ నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మరోవైపు ఈ నెల 25 నుంచి వచ్చేనెల 5 వరకూ ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వొద్దని రాయచోటి జిల్లా డీఈవో ఆదేశాలు జారీ చేశారు.

*సీఎం ఇంటి ముట్టడితో సంబంధం లేదు: ఏపీసీపీఎ్‌సఈఏ*
సెప్టెంబరు 1న మరో సంఘం ఇచ్చిన సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఏపీసీపీఎస్ఈఏ)కు ఎలాంటి సంబంధం లేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు శుక్రవారం స్పష్టంచేశారు. తమ సంఘం ఆధ్వర్యంలో 1న మిలియన్‌ మార్చ్‌ పేరుతో చలో విజయవాడ, ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయించామని దీనికే పోలీసుల అనుమతి కోరామన్నారు. సీఎం ఇల్లు ముట్టడి పేరుతో తమ సంఘంలోని సభ్యులకు నోటీసులిచ్చి భయభ్రాంతులకు గురి చేయవద్దని కోరారు.

*1న ఫ్యాప్టో నిరసనలు రద్దు*
సీపీఎస్‌ రద్దును డిమాండ్‌ చేస్తూ సెప్టెంబరు 1న తలపెట్టిన కలెక్టరేట్ల ఎదుట నిరసనల కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) వెల్లడించింది. అదేరోజున సీపీఎ్‌సపై రెండు సంఘాలు వారి కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో దానికి ఆటంకం లేకుండా, ఐక్య ఉద్యమాలకు సూచికగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్యాప్టో చైర్మన్‌ వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ సీహెచ్‌ మంజుల ప్రకటించారు.

27.08.2022 THE NEWS HEADLINES::

🔹Prime Minister Narendra Modi to embark on a two-day visit to Gujarat from today; To inaugurate several development projects.

🔹Agriculture Minister Narendra Singh Tomar asks Agriculture graduates to work towards bringing change in lives of farmers.

🔹Centre conducts door-to-door screening for Tuberculosis in over 68,000 tribal villages under Aashwasan campaign.

🔹Justice UU Lalit to assume charge as Chief Justice of India today.

🔹Veteran Congress leader Ghulam Nabi Azad resigns from primary membership of party.

🔹UGC declares 21 universities as fake; Highest number of fake institutions functioning in Delhi.

🔹 In Andhra Pradesh, Several restrictions were imposed by police to tackle the situation pertaining to agitations called by Employee associations on September 1.

🔹In Cricket, Asia Cup kicks off in Dubai today; Sri Lanka to take on Afghanistan in the opening match.
Previous Post Next Post

Contact Form