Type Here to Get Search Results !

PR టీచర్లకు పదోన్నతుల చానెల్

APTEACHERS
PR టీచర్లకు పదోన్నతుల చానెల్
  • Panchayat Raj MEO & DyEO Posts కు లైన్ క్లియర్
  • ప్రస్తుతం ఉన్న MEO&DyEO పోస్టుల పదోన్నతులన్నీ ప్రభుత్వ టీచర్లకే. రాబోయే కౌన్నిలింగ్ షెడ్యూల్ లో చోటు.
  • PR & Mpl స్కూళ్ళకు ప్రత్యేక MEO&DyEO పోస్టులకు సీఎం అంగీకారం. ఫైనాన్స్ అనుమతులు కూడా మంజూరు
  • సెప్టెంబర్ 5 న ప్రకటన & విడుదల
  • కొత్త PR MEO & DyEo పోస్టుల జీతాల కోసం మిగులు SGT పోస్టులు రద్దు.
  • ప్రస్తుత PR నుండి వచ్చిన MEO లు PR MEO లుగా కొనసాగింపు.
  • PR టీచర్లకు పదోన్నతులు.
  • ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యకు చరమగీతం పాడినట్లే.?????
పాఠశాల విద్యాశాఖలో వ్యవస్థీకృత సంస్కరణల అమల్లో భాగంగా టీచర్ల పోస్టుల స్థాయిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వివిధ స్థాయిల్లోని 2,342 ఉపాధ్యాయుల పోస్టులను మార్పిడి చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.

దీంతో పాటు 4,421 ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) లుగా, 998 స్కూల్ అసిస్టెంట్లను గ్రేడ్-2 ప్రిన్సిపల్‌ పోస్టుకు అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని 52 ప్రీ స్కూల్స్‌ను హైస్కూళ్లుగా మార్పు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యా సంస్కరణల అమలుకు కార్యచారణ చేపట్టినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Tags

Top Post Ad

Bottom Post Ad