How to Get/Download Aadhar Card without Register Mobile Number

How to Download Aadhar Card without Register Mobile Number. Most of us having the problem regarding with Aadhar Card. Mobile number is not linked to Aadhar Card. Hence they are not able to Download/ Order Aadhar PVC Card. Here is the Solution to Get the Aadhar Card without Mobile Number. Read the Step by Step Guide to get your Aadhar card without mobile number.

How to Get/Download Aadhar Card without Register Mobile Number

Aadhaar Card: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండానే ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎలానో ఇలా తెలుసుకోండి

ఇప్పుడు మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా కూడా UIDAI అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్లు నమోదు చేసుకోని వారికి సహాయం చేసేందుకు UIDAI ఈ చర్యలు తీసుకుంది. సులభమైన మార్గాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
ఆధార్ కార్డ్ వినియోగదారులకు అదిరిపోయే వార్త. ఇప్పుడు మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా కూడా మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 
ఇంతకుముందు.. ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయడానికి ఆధార్‌తో లింక్ చేయబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం. కానీ ఇప్పుడు తాజా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండానే ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకుపే అవకాశాన్ని కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI). రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా కూడా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆధార్‌ను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. వారి మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోని లేదా వారి నంబర్ నుంచి కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్న వారికి ఇలాంటి సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు, మొబైల్ నంబర్ లేకుండా ఆధార్ కార్డ్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

ఆధార్ డౌన్‌లోడ్ చేయడానికి సులభమైన ప్రక్రియను ఇక్కడ తెలుసుకుందాం


  • 1. ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ‘మై ఆధార్’పై క్లిక్ చేయండి.
  • 2. ఇప్పుడు ‘ఆర్డర్ ఆధార్ PVC కార్డ్’పై క్లిక్ చేయండి.
  • 3. ఇప్పుడు మీరు ఇక్కడ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయమని అడుగుతుంది.
  • 4. ఇక్కడ మీరు ఆధార్ నంబర్‌కు బదులుగా 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్ (VID)ని కూడా నమోదు చేయవచ్చు.
  • 5. ఈ ప్రక్రియ తర్వాత.. మీకు ఇచ్చిన సెక్యూరిటీ లేదా క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.
  • 6. మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేకుండా కార్డును డౌన్‌లోడ్ చేయాలనుకుంటే..’నా మొబైల్ నంబర్ రిజిస్టర్ చేయబడలేదు’ అనే ఎంపికపై క్లిక్ చేయండి.
  • 7. ఇప్పుడు మీ ప్రత్యామ్నాయ నంబర్ లేదా నమోదు చేయని మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  • 8. ఇప్పుడు ‘Send OTP’పై క్లిక్ చేయండి
  • 9. ఇప్పుడు మీరు నమోదు చేసిన ప్రత్యామ్నాయ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) పంపబడుతుంది.
  • 10. తర్వాత, మీరు ‘నిబంధనలు మరియు షరతులు’ చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి, చివరకు ‘సమర్పించు’పై క్లిక్ చేయండి.
  • 11. ఇప్పుడు మీరు కొత్త పేజీకి చేరుకుంటారు.
  • 12. రీప్రింటింగ్ ధృవీకరణ కోసం.. మీరు ఇక్కడ ఆధార్ లేఖ ప్రివ్యూ ఎంపికను పొందుతారు.
  • 13. దీని తర్వాత మీరు ‘మేక్ పేమెంట్’ ఎంపికను ఎంచుకోండి.
Previous Post Next Post

Contact Form