ONGC Scholarships 2023: ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు 2023 ఓఎన్జీసీ ఏడాదికి రూ.48,000 స్కాలర్షిప్పు

ONGC Scholarships 2023: ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు ఓఎన్జీసీ  ఏడాదికి రూ.48,000 స్కాలర్షిప్పు 



దేశంలోని అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజ వాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన ప్రతిభావంతు లైన పేద విద్యార్థులకు ఏటా ఉపకార వేతనాలు అందిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి ప్రకటన వెలువడింది

ONGC Scholarships 2023: ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు ఓఎన్జీసీ  ఏడాదికి రూ.48,000 స్కాలర్షిప్పు 

ఓఎన్జీసీ ఏటా మొత్తం 2000 స్కాలర్షిప్పులు అందిస్తోంది.
  • ఎస్సీ, ఎస్టీలకు 1000, 
  • ఓబీసీలకు 500, 
  • జనరల్ అభ్యర్థులకు 500 కేటాయించారు. 
అన్ని విభాగాల్లోనూ 50 శాతం స్కాలర్షిప్పులు మహిళలకు దక్కుతాయి.

వీటికి దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు.

ఎంపికైనవారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్షిప్పు అందుతుంది.
కోర్సు పూర్తయ్యేంతవరకు ఈ ఆర్ధిక ప్రోత్సాహం కొనసాగుతుంది.

ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు 2023 ఎవరికి: దేశంలో చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ కేటగిరీల్లో ప్రతి భావంతులైన పేద విద్యార్థులకు

ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు 2023 అర్హత:

ఏదైనా విద్యాసంస్థలో పుల్టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదుపుతున్నవారై ఉండాలి.

బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్ (బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/ జియోఫిజిక్స్/ ఎంబీఏ వీటిలో ఏ కోర్సు లోనైనా 2021-2022 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి, అలాగే ఎమ్మెస్సీ, జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60 శాతం ఉండాలి.

ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు 2023 వార్షిక ఆదాయం: 

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించరాదు.
ఎస్సీ, ఎస్టీలైతే రూ.4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది.

ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు 2023 వయసు:

జనవరి 1, 2021 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి.

ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు 2023 ఎంపిక ప్రక్రియ:

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ప్రాతిప దికన స్కాలర్షిప్పులు మంజూరు చేస్తారు.

ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు 2023 స్కాలర్షిప్పు వ్యవధి:

ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరినవారికి నాలు గేళ్లు, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున చెల్లిస్తారు.

ఓఎన్జీసీ 2000 స్కాలర్షిప్పులు 2023 దరఖాస్తు:

ఓఎన్టీసీ వెబ్సైట్లో వివరాలు నమోదుచేయాలి. కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల పత్రం, ఇంటర్ లేదా గ్రాడ్యుయే షన్ మార్కు షీట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు వివరాలు, పాన్ కార్డు, ఆధార్ కార్డు పత్రాల వివరాలు అందించాలి.


దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 6
వెబ్సైట్: https://ongcscholar.org/
Previous Post Next Post

Contact Form