Type Here to Get Search Results !

E-Insurance Mandatory from 1st April - IRDAI - Let's Know What is E-Insurance

APTEACHERS

E-Insurance Mandatory from 1st April - IRDAI - Let's Know What is E-Insurance.



E- insurance: ఏప్రిల్‌ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది❓ ఎవరికి ప్రయోజనం⁉️


➢E- insurance | ఇంటర్నెట్‌డెస్క్‌: బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) కీలక నిర్ణయం తీసుకుంది. బీమా పాలసీలను డిజిటలైజేషన్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. అంటే ఇకపై అన్ని బీమా సంస్థలూ ఎలక్ట్రానిక్ పద్దతిలోనే (E- insurance) పాలసీలను అందించాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్యం, సాధారణ బీమా సహా అన్ని బీమా పాలసీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.


ఏంటీ ఇ-ఇన్సూరెన్స్❓

ఇ-ఇన్సూరెన్స్ అకౌంట్ (EIA) అనే ఆన్‌లైన్‌ ఖాతాలో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్‌ రూపంలో సేవ్‌ చేస్తారు. ఈ ఖాతా సాయంతో పాలసీదారులు బీమా ప్లాన్‌లను ఆన్‌లైన్‌లోనే యాక్సెస్‌ చేయొచ్చు. దీంతో వీటి నిర్వహణ మరింత సౌకర్యంగా మారుతుంది. బీమా పాలసీలకు ఆదరణ పెరుగుతున్న వేళ.. వీటి వినియోగాన్ని సులభతరం చేయాలని ఐఆర్‌డీఏఐ భావిస్తోంది

ఉపయోగాలు ఇవే..

అన్ని బీమా పాలసీలను ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లోకి మారిస్తే.. ఇ-ఇన్సూరెన్స్‌ ఖాతా (EIA) ద్వారా సులభంగా యాక్సెస్‌ చేయొచ్చు. 

ఇది పూర్తిగా పేప‌ర్ ర‌హితం, ఆన్‌లైన్‌లో ఉంటుంది కనుక డాక్యుమెంట్లు పోగొట్టుకున్నా తిరిగి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఫిజికల్‌ కాపీలతో పోలిస్తే పత్రాలు కోల్పోయే ప్రమాదం తక్కువ. పాలసీ వివరాలు, పునరుద్ధరణ తేదీలను ఈజీగా ట్రాక్‌ చేయొచ్చు. 

పాలసీలో చిరునామా మార్చాలన్నా, వివరాలు అప్‌డేట్‌ చేయాలన్నా ఇ-ఇన్సూరెన్స్‌తో చాలా సులభం. 

పాలసీల డిజిటలైజేషన్‌తో బీమా సంస్థలు, పాలసీదారుల మధ్య కమ్యూనికేషన్‌ పెరుగుతుంది. దీంతో క్లెయిమ్‌ల ప్రక్రియ మరింత సౌకర్యవంతంగా మారుతుంది. 

ఇక బీమా తీసుకున్న వ్యక్తికి ఎటువంటి ఇబ్బందులూ ఉండవు.
Tags

Top Post Ad

Bottom Post Ad