ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు అనుమతివ్వండి
- తెలంగాణ సీఎస్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ
ప్రభుత్వ టీచర్లతో సమానంగా పరిగణించాలి
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించిన మున్సిపల్ టీచర్లుఅమరావతి, ఆంధ్రప్రభ:ప్రభుత్వ టీచర్లతో సమానంగా మున్సిపల్ టీచర్లను కూడా పరిగణించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ టీచర్లు శనివారం పాఠశాలల విరామ సమయంలో ఉద్యమించారు. అందరూ కలిపి ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పాఠశాలల్లోనే నిరసన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ టీచర్లతో సమానంగా పదోన్న తులు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ టీచర్లకూ డ్రాయింగ్ పవర్స్ ఇవ్వాలని, జిపిఎఫ్ అకౌంట్లను ఈనెలలోనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెడ్పి టీచర్లతోపాటు బదిలీలు ఇవ్వాలని కోరారు. 59 ఎంఇవో, 27 డిప్యూటీ ఇవో పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 59 జూనియర్ కాలేజీలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ నాలుగో తేదీలోపు తమ సమస్యలు పరిష్కరించకుంటే అక్టోబర్ ఎనిమిదో తేదీన జెఎసి సమావేశంలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నేత రామకృష్ణ తెలిపారు.
పదోన్నతుల కోసం సర్వీస్ రూల్స్ సవరణ
ఏడో వేతన సంఘం ఉద్యోగుల సవరణకు కేంద్రం నిర్ణయంప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం కనీస అర్హత సర్వీస్ నిబంధనలను ప్రభుత్వం సవరించనుంది. ఏడో సెంట్రల్ పే కమిషన్ (సిపిసి) పే మ్యాట్రిక్స్ అండ్ పే లెవెల్స్కు అనుగుణంగా ఉద్యోగుల పదోన్నతుల కోసం కనీస అర్హత సర్వీస్ అవసరాల నిబంధనలను సవరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఒపిటి) ఆఫీస్ మెమొరాండం (ఒఎం) ఈ విషయాన్ని ప్రకటించింది. "సవరించిన నిబంధనలను రిక్రూట్మెంట్ నియమాలు, సర్వీస్ రూల్స్, సరైన సవరణలు చేయడంతో చేర్చవచ్చు. అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు రిక్రూట్మెంట్ నియమాలు, సర్వీస్ రూల్స్కు తగిన విధానాన్ని అనుసరించిన తర్వాత అవసరమైన సవరణలను అమలు చేయాలని ఉన్నాయి. సూచించాం అని డిఒపిటి తెలిపింది.
కొత్త నిబంధనలు ఏమిటి?
ప్రమోషన్ కోసం లెవల్ 1 నుండి లెవల్ 2 వరకు కనీస అర్హత సర్వీస్ మూడేళ్లు సవరించిన నిబంధనలను నిర్దేశిస్తుంది. లెవల్ 2 నుండి లెవెల్ 3 వరకు మూడేళ్లు, లెవల్ 3 నుండి లెవెల్ 4 వరకు ఎనిమిదేళ్లు, లెవెల్ 3 నుండి లెవెల్ 4, లెవెల్ 4 నుండి లెవెల్ 5 వరకు ఒక్కొక్కటి ఐదేళ్లు. లెవల్ 6 నుండి 11కి మారడానికి ఎక్కువ సమయం 12 ఏళ్లు పడుతుంది. లెవెల్ 4 నుండి లెవల్ 6 వరకు, లెవల్ 6 నుండి లెవల్ 10 వరకు, లెవల్ 11 నుండి లెవల్ 13 వరకు ఒక్కొక్కటి పదేళ్లు, లెవెల్ 4 నుండి లెవల్ 11 వరకు తొమ్మిదేళ్లు సవరించిన నిబంధనలను నిర్దేశిస్తుంది. సవరణలు ఇంకా అధికారికంగా అమలు కావాల్సి ఉందని డిఒపిటి మెమోరాండం పేర్కొంది. "ఏడో సెంట్రల్ పే కమిషన్ (సిపిసి) పే మ్యాట్రిక్స్, పే లెవల్స్ ప్రకారం ప్రమోషన్ కోసం అవసరమైన కనీస అర్హత సేవను సవరించే సూచనలు ఇప్పటివరకు జారీ చేయలేదు. రిక్రూట్మెంట్ నియమాలు, సర్వీస్ నిబంధనలను రూపొందించడం, సవరించడం కోసం ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. రివైజ్డ్ పే మ్యాట్రిక్స్ పే లెవెల్స్ ప్రకారం ప్రమోషన్ కోసం కనీస అర్హత సర్వీస్ ను సూచించాలి" అని పేర్కొంది.
ఇంజినీరింగ్ బీ కేటగిరీ సీట్ల భర్తీ ఎప్పుడు?
అమరావతి: ఈఏపీ సెట్ కేటగిరి-బీ(యాజమాన్యకోటా) సీట్ల భర్తీపై ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. ఏ విధానంలో భర్తీ చేస్తుంది? విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? నేరుగా కళాశా లలకు వెళ్లాలా? ఎప్పటి నుంచి చేపడతారు? వంటి విద్యా ర్థులు, తల్లిదండ్రులు ప్రశ్నలకు సమాధానాలు లభించడం లేదు. కేటగిరి- బీ సీట్ల భర్తీ ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచి చేపడతామనే విషయాన్ని కళాశాలలకు చెప్పడం లేదు. దీంతో విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతు న్నారు. కేటగిరి-బీలో చేరే విద్యార్థులు కన్వీనర్ కోటా ఫీజుపై మూడింతలు చెల్లించాలనే నిబంధన విధించారు. కొన్ని యాజమాన్యాలు మాత్రం డొనేషన్లు తీసుకుంటు న్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకునే వారు కనిపించడం లేదు. కన్వీనర్ కోటా మొదటి విడత సీట్ల భర్తీ పూర్తి కావడంతో కోర్టు కున్న కళాశాలల్లో సీట్లు లభించని వారు యాజమాన్య కోటాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తారు.ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఈఆర్వోల నియామకం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పట్టభ ద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎలక్ట్రో రల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులను ఎన్నికల సంఘం నియమించింది. అలాగే రాష్ట్రంలోని 13 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లను ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులుగా, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి అప్పీలేట్ అధికారులుగా ఆయా జిల్లాల కలెక్టర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి కారి ముఖేష్ కుమార్ మీనా శనివారం మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.వర్సిటీల వివరాలు కోరిన ఉన్నత విద్యామండలి
అమరావతి: విశ్వవిద్యాలయాల పనితీ రుకు సంబంధించిన ప్రొఫైల్ను రూపొందిస్తున్నందున వివరాలు పంపించాలంటూ వర్సిటీలకు ఉన్నత విద్యా మండలి లేఖలు రాసింది. బోధన, బోధనేతర సిబ్బంది, రెగ్యులర్, ఒప్పంద, తాత్కాలిక సిబ్బంది, ఆర్థిక వ్యవహా రాల వివరాలు పంపించాలని కోరింది. వీటిని 26వతేదీ సాయంత్రం 4 గంటలోపు పంపించాలని సూచించింది.ఆర్థిక శాఖ ఆదేశాలతో బోర్డులో ఉద్యోగులు పదవీ విరమణ
అమరావతి: ప్రభుత్వం పెంచిన పదవీ విరమణ వయస్సు ఇంటర్ విద్యామండలి ఉద్యోగులకు వర్తించదని ఆర్థిక శాఖ ఆదేశాలు ఇవ్వడంతో శనివారం నలుగురు ఉద్యోగులు పదవీవిరమణ చేశారు. ఇటీవలే వీరికి 60 ఏళ్లు పూర్తయినా పెంపుపై స్పష్టత లేకపోవ డంతో జీతం తీసుకోకుండానే పని చేస్తున్నారు. స్పష్టత ఇవ్వాలని బోర్డు కార్యదర్శి రాసిన లేఖపై... వీరికి వర్తించదని ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చిందిప్రభుత్వ బడుల్లో నాణ్యత డొల్ల
- తెలుగులో పేరాను చదవలేకపోయిన 6, 7, 8 తరగతుల్లోని 41.58% మంది
- ప్రభుత్వం నిర్వహించిన బేస్లైన్ పరీక్షతోవిద్యార్థుల సామర్థ్యాలు బహిర్గతం
- 'మా పొలం చాలా పెద్దది. నాన్న రోజూ పొలానికి వెళ్తారు. మా పొలంలో వరి వేశాము. ఈ సంవత్సరం ధాన్యం బాగా పండింది' ఇలా తెలుగులో ఇచ్చిన చిన్న పేరాను సైతం ప్రభుత్వ బడు ల్లోని నాలుగు, ఐదు తరగతుల విద్యార్థులు 65. 04% మంది తప్పులు లేకుండా చదవలేకపో యారు. ఇదే పేరాను 6, 7, 8 తరగతులవారి లోనూ 41.58% చదవలేదు.
రెండంకెల తీసివేతలు కష్టమే..
విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం మూడోతరగతి పూర్తయ్యేసరికి తెలుగులో ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం రావాలి. ఆంగ్లంలో చిన్న పేరాను చదివి అర్థం చేసుకోవాలి. గణితంలో 999 వరకు ఆంకె లను గుర్తించడం, రెండు, మూడు అంకెలతో ఉన్న కూడి కలు, తీసివేతలు రావాలి. కానీ ఎనిమిదో తరగతికి వచ్చినా విద్యార్థుల్లో ఈ సామర్థ్యాలు ఉండటం లేదు.
- గణితంలో 90 కన్నా ఎక్కువ విలువగల సంఖ్య లను గుర్తించలేని వారు నాలుగు, ఐదు తరగ తుల్లో 38.04% ఉండగా.. 6,7,8 తరగతుల్లో 22.64% ఉన్నారు.
- రెండంకెల తీసివేతలు చేయనివారు నాలుగు, ఐదు తరగతుల్లో 40.69% ఉండగా.. 6,7,8 తరగతుల్లో 24.3% ఉన్నారు.
- ఒక అంకెతో రెండు అంకెలను భాగించాల్సిన లెక్కలు చేయనివారు నాలుగు, ఐదు తరగతుల్లో 8.3% ఉండగా.. 6,7,8 తరగతుల వారు 58. 65% ఉన్నారు.
- ఆంగ్లంలో చిన్నవాక్యం చదవలేని వారు 4, 5 తరగ 83.9%, 6,7,8 తరగతుల్లో 65.24% ఉన్నారు..
కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వపాఠశాల విద్యా ర్థులు ఆంగ్లం బాగా మాట్లాడుతున్నారని, ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. కానీ బెండపూడిలోనూ ఆంగ్లంలో కొందరి పరిస్థితి. అధ్వానంగా ఉంది. ఈ పాఠశాలలో 511మంది ఉండగా.వీరిలో 485 మంది బేస్లైన్ పరీక్షకు హాజరయ్యారు.
• 6,7,8 తరగతులలో 290 మందికి 58.27 % ఆంగ్లంలో చిన్నవాక్యాన్ని చదవలేకపోయారు.
• 9,10 తరగతుల్లో 195 మంది విద్యార్థులుండగా... వారిలో 45.64% ఆంగ్లంలో వాక్యం చదవలేకపోయారు.
ట్యాబ్లకు 3 నెలలు ఆగాల్సిందే!
అమరావతి: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే ట్యాబ్ల కోసం మరో 3 నెలలు ఎదురు చూడాల్సిందే. టెండర్ల ప్రక్రియ పూర్తయినా ట్యాబ్ల కొరత కారణంగా డిసెంబరు వరకు విద్యార్థులకు అందే పరిస్థితి కనిపించడం లేదు.ఎనిమిదో తరగతి చదివే 4,59,564 మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకు సెప్టెంబరులో అందిస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. టెండర్ల ప్రక్రియలో జాప్యంతో నవంబరులో అందించాలని నిర్ణయం తీసుకుంది. నవంబరు 14న బాలల దినోత్సవం సంద ర్భంగా ట్యాబ్లు అందిస్తామని ఈనెల 16న శాసనమండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కానీ, చిప్స్ కొరత, కంటెంట్ అప్ లోడ్ వంటి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల సకాలంలో వీటిని అందించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం ట్యాబ్ల సర ఫరా గుత్తేదారుతో సెప్టెంబరు 5న ఒప్పందం కుదుర్చు కుంది. మొత్తం 5,18,740 ట్యాబ్లను అందించేందుకు రూ. 66.4కోట్లు వ్యయం కానుంది. 64జీబీ మెమరీ కార్డుతో కూడిన ఒక్కో ట్యాబ్ను 12,843కు సరఫరా చేసేందుకు గుత్తేదారుతో ఒప్పందం చేసుకుంది.
Tags
News