మున్సిపల్ టీచర్లకు డీడీవో అధికారాలు త్వరలో అమల్లోకి..
టీచర్లందరికీ , గురుకుల పాఠశాలలు, యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది, ఎయిడెడ్లోని బోధనా సిబ్బందికి 62 ఏళ్ల సర్వీసు: బొత్సఅమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ టీచర్లకు నవంబరు నుంచి డీడీవో అధికా రాలు ఇస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారా యణ హామీ ఇచ్చారు. మున్సిపల్ టీచర్ల సమస్యలపై సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాల యంలో ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు. డీడీవో అధికారాలు లేకపోవడంతో ప్రతినెలా మున్సి పల్ ఉపాధ్యాయుల జీతాలు సమస్యగా మారిందని సంఘాలు మంత్రికి వివరించాయి. మున్సిపల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని కోరాయి. వీటిపై మంత్రి సానుకూలంగా స్పందిం చారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయ సును 62 ఏళ్లకు పెంచిందని తెలిపారు. గురుకుల పాఠశాలలు, యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది, ఎయిడెడ్లోని బోధనా సిబ్బందికి కూడా ఇదే వర్తిం చేలా ఫైళ్లు పెట్టామని తెలిపారు.
ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కత్తి నర్సింహారెడ్డి
రాష్ట్రాపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి పేరు ఖరారు చేశారు. ఈ మేరకు STU రాష్ట్ర కార్యవర్గం సోమవారం తీర్మానించింది.ఎన్టీఆర్ జిల్లా విద్యాశాకాధికారి కార్యాలయంలో పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లా విద్యాశాకాధికారి కార్యాలయంలో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సీవీ రేణుక ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రోగ్రాం కో ఆర్డినేటర్, డేటా అనలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. దరఖాస్తు, అర్హతలు ఇతర వివ రాలతో అప్లికేషన్ నమూనాను www.deontr.co.in వెబ్సైట్లో ఉంచినట్లు ఆమె పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సబ్ కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా విద్యాశాకాధికారి కార్యాలయంలో ఈ నెల 30 సాయంత్రం 5 గంటల్లోపు అందజే యాలని డీఎంహెచ్ వో సూచించారు.వివరాలు మరియు అప్లికేషన్ ఫామ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
మహిళా-శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితరాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలకు పౌష్టికాహారం కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
◾సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
థర్డ్ పార్టీలతో నాణ్యత తనిఖీ
పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా అధికారులు దృష్టి సారించాలి. పౌష్టికాహార పంపిణీలో ఏ చిన్న లోపానికీ తావులేకుండా కట్టుదిట్టమైన విధానాలను అమలు చేయాలి. పూర్తిస్థాయిలో నాణ్యత తనిఖీలు చేసిన తర్వాతే పిల్లలకు అందాలి. ఇందుకోసం థర్డ్ పార్టీలతో తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి.
అంగన్‌వాడీల్లో పిల్లల భాష, ఉచ్ఛారణలపై ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పాఠశాల విద్యాశాఖతో కలిసి పకడ్బందీగా పీపీ-1, పీపీ-2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి. అంగన్‌వాడీ పిల్లలకు అందించే పాఠ్య పుస్తకాలు అన్నీ బైలింగ్యువల్ టెక్టŠస్‌బుక్స్(ద్వి భాషా పాఠ్య పుస్తకాలు) ఉండాలి.
♦️నిర్వహణ, పరిశుభ్రతకు ప్రత్యేక నిధి
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఏర్పాటైన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం తెచ్చిన ఎస్‌ఎంఎఫ్ తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలి. అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని నెలకొల్పాలి. అంగన్‌వాడీలు, మరుగుదొడ్ల మరమ్మతుల పనులు చేపట్టాలి.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. ఆ నంబర్‌తో ముద్రించిన పోస్టర్లను ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో కచ్చితంగా ప్రదర్శించేలా అంగన్‌వాడీ వర్కర్లకు బాధ్యత అప్పగించాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలును పటిష్టంగా పర్యవేక్షించాలి.
♦️దివ్యాంగులకు సచివాలయాల్లో సేవలు..
రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. దివ్యాంగులకు సేవలందించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ అప్‌గ్రేడ్ దిశగా అడుగులు వేయాలి. రాష్ట్రంలో జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాలపై అధ్యయనం చేపట్టి ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలి.
♦️కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ
రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా వధూవరులు వివాహ వయసును కచ్చితంగా పాటించేలా నిబంధన విధించినందున బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వల్ల విద్యను కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది.
♦️మనో వైకల్య బాధితులకు పెన్షన్లు
మానసిక వైకల్య బాధితులకు వైద్యులు జారీ చేసిన తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ఏటా జూలై, డిసెంబర్‌లో లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు మానసిక వైకల్య బాధితులకు తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా డిసెంబర్‌లో పెన్షన్లు మంజూరు కానున్నాయి.
♦️ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీ నిర్వహిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామన్నారు. అవసరమనుకుంటే ఆన్సర్‌షీట్లను పరిశీలించుకునే అవకాశాన్ని సైతం పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు కల్పించినట్లు చెప్పారు.
28 నుంచి ఈఏపీ సెట్ బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తుల స్వీకరణ
అమరావతి: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీ సెట్ అడ్మిషన్లలో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహమ్మద్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అభ్య ర్డులు 'హెబ్రీటీపీ పీఎస్: //సెట్స్ ఏపీ ఎస్సీ హె చ్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్' ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చని, లేదా ఆయా కాలేజీలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకో వచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయా కాలేజీలు ఈ నెల 27న నోటిఫికేషన్లు జారీ చేస్తాయని, అక్టోబర్ 10 వరకు దరఖా స్తుకు గడువు ఉంటుందని, 14న మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయాల్సి ఉందని వివరించారు.త్వరలో ఫిజికల్ డైరెక్టర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి
కర్నూలు (టౌన్): త్వరలోనే డిగ్రీ కళాశాలల ఫిజి కల్ డైరెక్టర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు కల్పిస్తా మని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో క్రీడలకు ప్రా ధాన్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. సోమవారం కర్నూ లులోని సిల్వర్ జూబ్లీ కళాశాలలో అంతర్ రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. పోలా భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్ లను, ఎంతో మందిని ఉన్నత విద్యా వంతులుగా తీర్చిదిద్దిన చరిత్ర సిల్వర్ జూబ్లీ కళాశాలకు ఉందన్నారు. రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆనందరావు మాట్లాడుతూ విద్యార్థుల మానసిక వికాసానికి క్రీడలు దోహదపడతాయన్నారు. క్లస్టర్ వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిగోపాల్, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కుమార్ తదిత రులు మాట్లాడారు. తొలిరోజు పోటీల్లో భాగంగా సిల్వర్ జూబ్లీ కళాశాల, హైదరాబాద్ డిగ్రీ కళాశాల జట్ల మధ్య వాలీబాల్ మ్యాచ్ నిర్వహించారు.ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల నేడు
అమరావతి: విద్యా హక్కు చట్టం (ఆరీ ఈ) కింద ప్రైవేటు స్కూళ్లలో పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పించేందుకు ఎంపిక చేసిన రెండో విడత జాబితా మంగళవారం విడుదల కానుంది. తల్లిదండ్రులు ఆ జాబితాను సంద ర్శించి తమ పిల్లలను ఈ నెల 28 నుంచి అక్టో బర్ 10వ తేదీలోపు ఎంపికైన పాఠశాలల్లో చేర్చాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉద్యోగంతో కూడిన ఎంఎస్ కోర్సులు
అమరావతి: రాష్ట్ర విద్యార్థులకు ఉద్యోగంతో కూడిన ఎంఎస్ కోర్సులను అందించేలా జర్మనీ దేశానికి చెందిన ఎస్జీఐటీ స్టీన్బీస్ పర్సిటీతో ఉన్నత విద్యామండలి సోమవారం ఒప్పందం చేసుకుంది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ కె. హేమచంద్రారెడ్డి సమక్షంలో కార్యదర్శి నజీర్ అహమ్మద్, ఎస్జీఐటీ స్టీన్బీస్ వర్సిటీ డైరెక్టర్ బెట్రమ్ లోహ్మూర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పం దంతో రాష్ట్ర విద్యార్థులకు ఉన్నత ఉద్యోగావ కాశాలు మెరుగుపడతాయని హేమచంద్రా రెడ్డి తెలిపారు. బెట్రమ్ లోహ్మూర్ మాట్లా డుతూ రానున్న నాలుగేళ్లలో బాష్ వంటి కంపెనీలకు 5 లక్షల మంది అభ్యర్థులు అవ సరం అవుతారని చెప్పారు.అంగన్వాడీల నిర్వహణకు ప్రత్యేక నిధి .. సమీక్షలో సీఎం జగన్
- అంగన్వాడీ పిల్లలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం
- అంగన్వాడీలు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ బియ్యం
- పౌష్టికాహారం కొనుగోళ్లు, పంపిణీపై మార్కెఫెడ్ పైలెట్ ప్రాజెక్ట్
- అంగన్‌వాడీల్లో చిన్నారుల భాష, ఉచ్ఛారణలపై ప్రత్యేక శ్రద్ధ
- విద్యాశాఖతో కలిసి పీపీ-1, పీపీ-2 పాఠ్యప్రణాళిక అమలు
- ఈ నెలాఖరుకు సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ
- అంగన్‌వాడీల పర్యవేక్షణకు యాప్
- దివ్యాంగులకు సచివాలయాల్లోనే సేవలు.. భవిత సెంటర్ల దిశగా అడుగులు.. తాత్కాలిక ధ్రువపత్రాలున్న మనో వైకల్య బాధితులకు డిసెంబర్‌లో పింఛన్లు
- కళ్యాణమస్తుతో బాల్య వివాహాలకు అడ్డుకట్ట
- మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో సీఎం జగన్ దిశానిర్దేశం
మహిళా-శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం తదితరాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీలకు పౌష్టికాహారం కొనుగోలు, పంపిణీ విధానాలను సమగ్రంగా సమీక్షించారు. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
◾సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ..
అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారంపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
థర్డ్ పార్టీలతో నాణ్యత తనిఖీ
పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా అధికారులు దృష్టి సారించాలి. పౌష్టికాహార పంపిణీలో ఏ చిన్న లోపానికీ తావులేకుండా కట్టుదిట్టమైన విధానాలను అమలు చేయాలి. పూర్తిస్థాయిలో నాణ్యత తనిఖీలు చేసిన తర్వాతే పిల్లలకు అందాలి. ఇందుకోసం థర్డ్ పార్టీలతో తనిఖీలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలి.
అంగన్‌వాడీల్లో పిల్లల భాష, ఉచ్ఛారణలపై ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పాఠశాల విద్యాశాఖతో కలిసి పకడ్బందీగా పీపీ-1, పీపీ-2 పిల్లలకు పాఠ్యప్రణాళిక అమలు చేయాలి. అంగన్‌వాడీ పిల్లలకు అందించే పాఠ్య పుస్తకాలు అన్నీ బైలింగ్యువల్ టెక్టŠస్‌బుక్స్(ద్వి భాషా పాఠ్య పుస్తకాలు) ఉండాలి.
♦️నిర్వహణ, పరిశుభ్రతకు ప్రత్యేక నిధి
పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఏర్పాటైన టీఎంఎఫ్, స్కూళ్ల నిర్వహణ కోసం తెచ్చిన ఎస్‌ఎంఎఫ్ తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలి. అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధిని నెలకొల్పాలి. అంగన్‌వాడీలు, మరుగుదొడ్ల మరమ్మతుల పనులు చేపట్టాలి.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో సమస్యలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. ఆ నంబర్‌తో ముద్రించిన పోస్టర్లను ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో కచ్చితంగా ప్రదర్శించేలా అంగన్‌వాడీ వర్కర్లకు బాధ్యత అప్పగించాలి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎస్‌డీజీ లక్ష్యాలను చేరుకునే కార్యక్రమాల అమలును పటిష్టంగా పర్యవేక్షించాలి.
♦️దివ్యాంగులకు సచివాలయాల్లో సేవలు..
రాష్ట్రంలో దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల వారికి వ్యయ ప్రయాసలు తగ్గుతాయి. దివ్యాంగులకు సేవలందించేలా ప్రతి నియోజకవర్గంలో ఒక భవిత సెంటర్ అప్‌గ్రేడ్ దిశగా అడుగులు వేయాలి. రాష్ట్రంలో జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాలపై అధ్యయనం చేపట్టి ఏం చేస్తే బాగుంటుందో సూచనలు చేసేందుకు ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించాలి.
♦️కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ
రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కళ్యాణమస్తు పథకం బాల్య వివాహాల నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పథకం ద్వారా వధూవరులు వివాహ వయసును కచ్చితంగా పాటించేలా నిబంధన విధించినందున బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయవచ్చు. తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన వల్ల విద్యను కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది.
♦️మనో వైకల్య బాధితులకు పెన్షన్లు
మానసిక వైకల్య బాధితులకు వైద్యులు జారీ చేసిన తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా పెన్షన్లు మంజూరు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు కొత్తగా అర్హత సాధించిన వారికి ఏటా జూలై, డిసెంబర్‌లో లబ్ధి చేకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు మానసిక వైకల్య బాధితులకు తాత్కాలిక ధృవపత్రాల ఆధారంగా డిసెంబర్‌లో పెన్షన్లు మంజూరు కానున్నాయి.
♦️ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అత్యంత పారదర్శకంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ (గ్రేడ్-2) పోస్టుల భర్తీ నిర్వహిస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని తెలిపారు.
ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామన్నారు. అవసరమనుకుంటే ఆన్సర్‌షీట్లను పరిశీలించుకునే అవకాశాన్ని సైతం పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు కల్పించినట్లు చెప్పారు.
అంగన్‌వాడీలకు అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రత్యేకంగా యాప్
సూపర్ వైజర్ల పర్యవేక్షణతోపాటు అంగన్‌వాడీలకు అక్టోబర్ 1వతేదీ నుంచి ప్రత్యేకంగా యాప్ కూడా అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తద్వారా అంగన్‌వాడీల్లో పాలు, ఆహారం సరఫరా మెరుగైన రీతిలో పర్యవేక్షించనున్నారు. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషాశ్రీచరణ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, మార్క్‌ఫెడ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు.
పంచాయితీ లకే నేరుగా ఆర్ధిక సంఘం నిధులు-
Tags
News