Telugu Educational News 4th Oct 2022

దసరా వచ్చినా అందని జీతం కోసం ఎదురుచూపు

  • ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆవేదన
  • శనివారం కొద్దిగా, ఆదివారం ఇంకాస్త జమ
  • సోమవారం మెసేజ్‌కోసం ’సెల్‌’ చూపులే
  • తీవ్ర ఆవేదనలో ఉద్యోగులు, పెన్షనర్లు
  • అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి చెల్లింపులే లేవు
  • దసరా సరదా కూడా మిగల్చరా అంటూ వేదన
రేపే దసరా! రెండు రోజుల్లో పండగ పెట్టుకుని ఈ నెల జీతాలు ఇంకా పడకపోవడంతో చాలామంది ఉద్యోగుల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. వేడుక మూడ్‌లోకి ఇప్పటికే వెళ్లిపోవాల్సిన వీరు.. శాలరీ మెసేజ్‌ల కోసం సెల్‌ఫోన్లు చూస్తూ గడిపేయాల్సి వస్తోంది. వేతనాలు పడితే తీసుకోవాల్సిన కొత్త దుస్తులు, ఇంటికి తెచ్చుకోవాల్సిన గృహోపకరణాలపై వేసుకున్న లెక్కలు వెక్కిరిస్తుంటే..పలువురు ఉద్యోగులు ఆవేదనతో నిట్టూరుస్తున్నారు. ‘దసరా సరదా కూడా మాకు మిగల్చరా’ అంటూ వేదనతో ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 14 లక్షలమంది, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉన్నారు. వీరిలో సోమవారం అర్ధరాత్రి నాటికి ఉద్యోగుల్లో పాతికశాతం మందికి మాత్రమే జీతాలు అందాయి. మూడోవంతుమందికి మాత్రమే పెన్షన్లు పడ్డాయి. ప్రభుత్వం ఇంకో రూ.2 వేల కోట్లు అప్పు తీసుకురావడంతో మరికొంత మందికి పడే అవకాశం ఉంది. అయితే.. ఉద్యోగులందరికీ ఒకేసారి వేతనాలు అందే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. జీతాలు దశలవారీగానే అందనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల కింద నెలకు రూ. 3,700 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ. 1000 కోట్ల విలువైన చెల్లింపులు మాత్రమే ఇప్పటివరకు జరిగాయి. పెన్షనర్లకు రూ. 1600 కోట్లు పెన్షన్లు కింద ఇవ్వాలి.

అందులో రూ. 500 కోట్లు విలువైన చెల్లింపులు జరిగాయి. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాల చెల్లింపే జరగలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు..ఇలా మొత్తంగా చూసుకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా 24 శాతం నుంచి 30 శాతం వరకు మాత్రమే ప్రభుత్వ వేతనాలు, పెన్షన్ల రూపంలో అందుకున్నారు. రాష్ట్రంలో ఏ ఇద్దరు ఉద్యోగుల కలిసినా ఇప్పుడు ఒకటే చర్చ! జీతం పడిందా? లేదా? అని పరస్పరం ఆరా తీసుకుంటున్నారు.

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు అందాలి. శనివారం సాయంత్రానికి రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులతోపాటు,. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో మూడోంతుల మందికి ఆరోజు పడలేదు. కొంత మందికి 2వ తేదీ ఆదివారం వారి ఖాతాల్లో జమ అయ్యాయి. మొత్తం మీద వీరికి వేతనాలు పడినాయి...పడలేదు అని చెప్పడానికి వీలు లేకుండా అంతా ఆర్థికశాఖ కార్యదర్శి చేతుల్లోనే ఉందనే వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లోనే వినిపిస్తోంది. దీంతో క్షణక్షణం ఉద్యోగులు తమ సెల్‌ ఫోన్‌కి బ్యాంకు నుంచి ఏమైనా సందేశం వచ్చిందేమో అని చూసుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలను పదేపదే చెక్‌ చేసుకుంటున్నారు. తోటి ఉద్యోగులను జీతం పడిందా అంటూ వాకబు చేస్తున్నారు. ఉద్యోగులు ఇళ్ల రుణాలు, కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరోగ్య కారణాలతో బ్యాంకుల్లో పలు రుణాలు తీసుకుంటారు. అయితే ఆ రుణాలు నెల నెలా ఈఎంఐల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల ఈఎంఐ 5వ తేదీకి కటాఫ్‌ డేట్‌గా ఉంటుంది. అయితే మూడవ తేదీ సాయంత్రానికి వేతనాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్‌ పెరిగిపోయింది. సకాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే సిబిల్‌ స్కోర్‌ దెబ్బ తింటుందని, ఆ తర్వాత తమకు బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి పోతుందని వాపోతున్నారు

ఇక రూరల్‌ సర్వీస్‌ తప్పదు

  • మెడికల్‌ పీజీ లేదా సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తవగానే అందరూ ఏడాది సర్వీస్‌ చేయాల్సిందే
  • 2022-23 విద్యా సంవత్సరం నుంచే అమలు
  • రూరల్‌ సర్వీస్‌ చేయకుంటే భారీగా జరిమానా
రాష్ట్రంలోని మెడికల్‌ విద్యార్థులకు రూరల్‌ సర్వీస్‌ నిబంధన అమలులోకి వచ్చింది. మెడికల్‌ పీజీ అనంతరం లేదా సూపర్‌ స్పెషాలిటీ కోర్సు అనంతరం ప్రతిఒక్కరూ కచ్చితంగా ఒక ఏడాదిపాటు రూరల్‌ సర్వీస్‌(ప్రభుత్వ సర్వీస్‌) చేయాలని ప్రభుత్వం పేర్కొం ది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు. వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత మెడికల్‌ విద్యార్థులకు రూర ల్‌ సర్వీస్‌ అమలు చేయాలని, ప్రభుత్వ వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్‌ను నిషేధించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగానే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తొలిదశలో విద్యార్థులకు రూరల్‌ సర్వీస్‌ను అమలు చేసింది. దీని ప్రకారం మెడికల్‌ పీజీ లేదా సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల అనంతరం రూరల్‌ సర్వీస్‌ చేయాల్సిందే. లేదంటే భారీ జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

మెడికల్‌ పీజీ అనంతరం రూరల్‌ సర్వీస్‌ చేయకుంటే రూ.40 లక్షలు, ఒకవేళ పీజీలో తప్పించుకుని సూపర్‌ స్పెషాలిటీ చేసిన అనంతరం కూడా రూరల్‌ సర్వీస్‌ చేయకపోతే రూ.50 లక్షలు జరిమానా చెల్లించాలి. వాస్తవానికి ప్రభు త్వం తొలుత ఎంబీబీఎస్‌, పీజీ విద్యార్థులకు మాత్రమే దీన్ని అమలు చేయా లని నిర్ణయించింది. కానీ ఎంబీబీఎస్‌ పూర్తిచేసి ప్రభుత్వ సర్వీస్‌లోకి వచ్చిన వైద్యులు సరిపడా ఉన్నారు. అయితే స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు పూర్తిచేసిన వారు మాత్రం ఎక్కువగా ప్రభుత్వ సర్వీస్‌లోకి రావడం లేదు. కాబట్టి మెడికల్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల అనంతరం రూరల్‌ సర్వీస్‌ నిబంధనను తీసుకొచ్చింది. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పీజీ చదివిన విద్యా ర్థులు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఫ్రీ సీట్లు పొందిన విద్యార్థులకు మాత్రమే రూరల్‌ సర్వీస్‌ నిబంధన వర్తిస్తుంది. 2022-23 విద్యా సంవత్సరంలో మెడికల్‌ పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు, ఇదే ఏడాది సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో చేరిన వారికి దీన్ని అమలు చేయనున్నారు. కోర్సుల్లో చేరిన సమయంలోనే ప్రభుత్వం వారి వద్దనుంచి బాండ్లు తీసుకోనుంది. బాండ్‌ ఇస్తేనే వారికి కౌన్సెలింగ్‌లో అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వం కొన్నేళ్లుగా ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వైద్యులను ని యమించాలని ప్రయత్నిస్తోంది. ఈ ఆస్పత్రులు ఎక్కువ శాతం రూరల్‌, గిరి జన ప్రాంతాల్లోనే ఉండడంతో అక్కడ విధులు నిర్వర్తించేందుకు వైద్యులు మొగ్గు చూపడం లేదు. కాబట్టి మెడికల్‌ విద్యార్థులైతే కచ్చితంగా వెళ్తారన్న ఉద్దేశంతో రూరల్‌ సర్వీస్‌ను తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా విడుదల చేసిన జీవోలో కూడా పీజీ అనంతరం తొలుత ఏపీవీవీపీ ఆస్పత్రుల్లోనే రూరల్‌ సర్వీ స్‌ కేటాయిస్తామని పేర్కొంది. ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో పోస్టింగ్‌ ఇవ్వగా మిగిలి న వారిని డీఎంఈల్లో భర్తీ చేస్తారు. మరోవైపు విద్యార్థులు తమ కోర్సులు పూ ర్తిచేసిన 18 నెలల్లోగా రూరల్‌ సర్వీస్‌ చేయాలి. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే మరో ఆరు నెలలు గ్రేస్‌ పిరియడ్‌ను ఇస్తారు.

గతంలో రెండేళ్ల నిబంధన..
2012-13లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఇలానే రూరల్‌ సర్వీస్‌ అమలు చేయాలని నిర్ణయించింది. ఎంబీబీఎస్‌ తర్వాత ఒక ఏడాది, పీజీ తర్వాత మరో ఏడాది మొత్తంగా రెండేళ్ల పాటు రూరల్‌ సర్వీస్‌ చేయాలని నిబంధన పెట్టింది. ఆ సమయంలో జూనియర్‌ డాక్టర్లు పెద్దఎత్తును ఉద్య మం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మెడికల్‌ విద్యార్థులు 45 రోజుల పాటు విధు లు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి రెండేళ్ల రూరల్‌ సర్వీస్‌ను ఒక ఏడాదికి కుదించింది. కానీ ఆ తర్వాత అధికారంలో కొచ్చిన టీడీపీ ప్రభుత్వం రూరల్‌ సర్వీస్‌ను రద్దు చేసింది. మళ్లీ ఇప్పుడు జగన్‌ సర్కారు దాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు

  • చిన్నారులకు 'బబ్లింగ్ పరీక్ష'
  • ఫార్మేటివ్ పరీక్షల స్థానే సీబీఏ విధానం
  • విద్యార్థితో పాటే టీచరు ఎనాలిసిస్ ? ఓఎమ్మార్ విధానంలో ఫార్మెటివ్ -1, 3, సమ్మెటివ్-2 పరీక్షలు
  • దిద్దుబాట్లకు ఆస్కారముందంటూ ఉపాధ్యాయుల ఆందోళన
ప్రపంచ బ్యాంకుతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది పార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షల్లో మార్పులు చేసింది. ఫార్మెటివ్-1, 3, సమ్మెటివ్-2 పరీక్షలను తరగతి గది ఆధారిత అంచనా (సీబీఏ) విధానంలో నిర్వహిస్తారు, ప్రపంచ బ్యాంకు ఒప్పందం నేపథ్యంలో విద్యా ర్థుల సామర్థ్యాలను విశ్లేషించేందుకు ఎడ్యుకేషన్ ఇనిషి యేటివ్స్ సంస్థతో విద్యాశాఖ మరో అవగాహన చేసుకుంది. ఈ సంస్థ ఆదేశాలతో పరీక్షల్లో మార్పులు చేశారు. ఫార్మెటివ్ పరీక్షల్లో 15 మార్కులకు ఓఎమ్మార్ విధానంలో, మరో ఐదు మార్కులకు రాతపూర్వకంగా పరీక్ష నిర్వహిస్తారు. 1-8తరగతుల విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు కలిపి ఒకే ఓఎమ్మార్ షీటు ఇస్తారు. ఇందు లోనే ఒక్కో సబ్జెక్టుకు 15 చొప్పున బహుళైచ్చిక సమా దానాలు ఉంటాయి. మొదటి రోజు ఉదయం ప్రశ్నప క్షేత్రంతోపాటు ఓఎమ్మార్ షీటు ఇస్తారు. మధ్యాహ్నం పరీక్షకు మళ్లీ అదే ఓఎమ్మారు ఇస్తారు. ఇలా రెండు రోజులపాటు జరిగే పరీక్షలకు ఓఎమ్మార్ ఇచ్చి, తీసు కుంటారు. ప్రైవేటు వారికి ఓఎమ్మార్ షీట్లు ఉండవు. వారు ప్రశ్నపత్రంలోనే జవాబులు రాయాల్సి ఉంటుంది. ఉర్దూ, కన్నడ లాంటి మైనర్ భాషలకు కూడా అంతే. ఈ షీట్ల ముద్రణ ఆలస్యమవుతున్నందున పరీక్షల షెడ్యూలును మార్చేశారు. నవంబరు 2-5 వరకు ఫార్మె టివ్-1 పరీక్షలు ఉంటాయి. 9, 10 తరగతులకు పాత విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు.

♦️తప్పుల సవరణకు అవకాశం?
విద్యార్థులకు ఉదయం పరీక్షకు సంబంధించిన ఓఎమ్మార్ షీటునే మళ్లీ మధ్యాహ్నం ఇస్తే సమాధానాలు మార్చే అవకాశం ఉంటుందని, తద్వారా అందరికీ ఎక్కువ మార్కులు రావొచ్చని ఉపాధ్యాయులు చెబు తున్నారు. ఉదాహరణకు.. 1-5 తరగతులకు నవం బరు ఒకటిన మొదటి రోజు ఉదయం తెలుగు ప్రశ్న పత్రంతోపాటు 15 మార్కుల బహుళైచ్చిక జవాబులు రాసేందుకు ఓఎమ్మార్ షీటు ఇస్తారు. అందులో విద్యార్ధులు కొన్నింటికి తప్పుడు సమాధానాలు రాయొచ్చు. పరీక్ష తర్వాత పిల్లలు తాము రాసిన జవా బుల్లో తప్పులను గుర్తిస్తారు. మధ్యాహ్నం జరిగే గణిత పరీక్షకు ఉదయం ఇచ్చిన ఓఎమ్మార్ షీట్నే మళ్లీ ఇస్తే ఉదయం మార్క్ చేసిన సమాధానాల్లోని తప్పులను సరిచేసే అవకాశం ఉంటుంది. అలాంట ప్పుడు విద్యార్థుల సామర్థ్యాలను ఎలా అంచనా వేయ ''గలం' అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు ఒప్పందం కారణంగా బేస్ లైన్ పరీక్ష, తరగతి గది ఆధారిత అంచనా పరీక్షలంటూ ముద్రణకే రూ. కోట్లు వెచ్చిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

త్రిశంకు స్వర్గంలో మున్సిపల్ టీచర్లు

♦️డీడీవో అధికారాల బదలాయింపుపై సందిగ్ధం
♦️పాఠశాల విద్యాశాఖలో విలీనంపై అనుమానాలు

🌻అమరావతి,ఆంధ్రప్రభ:పాఠశాల విద్యాశాఖలో మున్సి పల్ టీచర్లను కలుపుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకు న్నప్పటికీ మున్సిపల్ టీచర్ల పరిస్థితి ఇప్పటికీ త్రిశంకు స్వర్గం లోనే ఉంది. వచ్చే నెల నుండి తమ జీతాలు తామే డ్రాయింగ్ చేసుకునేలా డీడీవో అధికారాలు ఇస్తామని విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చి నప్పటికీ ఆచరణలో సమస్యలు తలెత్తవచ్చుననే అనుమానాలను ఉపాధ్యాయ సంఘాలు వెల్లడి స్తున్నాయి. జిల్లా పరిషత్ స్కూల్లోకి మున్సి పల్ టీచర్లను విలినీం చేస్తామని మూడు నెలలుగా ప్రభుత్వం చెబూతూనే ఉంది కానీ ఆ పని మాత్రం జరగడం లేదు. ఇప్పటి వరకు విద్యాశాఖకు, మున్సిపల్ శాఖకు మధ్య ఒక అవగాహన ఒప్పం దం మాత్రమే జరిగింది. ఆ అవగాహన ఒప్పం దాన్ని కేబినెట్ ఆమోదిం చింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా మున్సిపల్ టీచర్ల విలీ నం. చట్ట ప్రకారం సమస్యలు వస్తాయని, మున్సిపల్ టీచర్లకు ప్రయోజనాలను జిల్లా పరిషత్ స్కూళ్ల లో కలపడం ద్వారా ఇవ్వడం సాధ్యం కాని పని అని న్యాయ శాఖలోనిఓ అధికారి పేర్కొన్నారు. కాగా తమను జిల్లా పరిషత్ స్కూళ్ల లో కాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యలో కలపాలని ఉపాధ్యా య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మున్సిపల్
కౌన్సిళ్లు కూడా మున్సి పల్ టీచర్లను ప్రభుత్వ పాఠశాల విద్యలో విలినీం చేయాలనే తీర్మానం చేశాయని, కానీ ప్రభుత్వం మాత్రం మున్సిపల్ టీచర్లను జిల్లా పరిషత్ పాఠ శాల విద్యలో కలుపుతు న్నారని, ఇది అన్యాయ మని అంటు న్నారు. అసలు మున్సిపల్ టీచర్లను ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖలో విలినీం చేయా ల్సిన అవ సరమే లేదని, మున్సిపల్ విద్యకు ఒక డైరెక్టరేట్ పెడితే సరిపోతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మున్సి పల్ విద్య మున్సిపల్ శాఖ పరిధిలోనే ఉందని, రాష్ట్రంలో మాత్రం దీన్ని జెడ్పీ పాఠశాల విద్యలో కలిపేస్తున్నారని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నేత రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. పురపాలక విద్య పురపాలక చట్టాల ప్రకారమే ఉండాలని, పురపాలక సర్వీసు రూల్స్ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్ల పదోన్నతులకు షెడ్యూల్ విడుదల

ప్రభుత్వపాఠశాలల్లో జిల్లా పరిషత్, మండల్ పరిషత్ స్కూళ్లలో స్కూల్ అసి సెంటు, గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లుగా పదోన్నతులు ఇచ్చేందు కు ప్రాధమిక విద్యాశాఖ షెడ్యూల్ను ప్రకటించింది. ఈనెల రెండో తేదీ నుండి సినీయారిటీ జాబితాను . తయారు చేస్తున్నారు. సీనియారిటీ జాబితాను ఏడో తేదీ నుండి వెబ్సైట్లో ఉంచు తారు. ఈనెల ఏడు, ఎనిమిది తేదీల్లో సీనియారిటీ జాబితాపై ఆన్లైన్లో అభ్యంతరాల ను స్వీకరిస్తారు. తొమ్మిదో తేదీన అభ్యంతరాలపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తారు. పదో తేదీన తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తారు. పదమూడో తేదీ నాటికి పదోన్నతల ప్రక్రియనంతా ముగిస్తారు.

చర్చించకుండానే పరీక్ష విధానంలో మార్పులా?

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండానే ప్రభుత్వం పాఠశాల పరీక్షల్లో మార్పులు తీసుకొచ్చిందని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్), ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య పేర్కొన్నాయి. ఇప్పుడు ఉన్న పరీక్ష విధానంలో ఏం లోపం ఉందో.. కొత్త విధానంతో విద్యార్థులకు ఏం లాభం కలుగుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశాయి. ప్రతి ఏడాది పరీక్షల్లో రకరకాల మార్పులు చేయడం వల్ల విద్యార్థులు నష్ట పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి.

కారుణ్య నియామకం.. హక్కు కాదు

♦️ఓ ప్రత్యేక సదుపాయం మాత్రమే: సుప్రీంకోర్టు
దిల్లీ: కారుణ్య నియామకం.. ఉద్యోగి ఆకస్మిక మృతితో బాధిత కుటుంబం ఆటుపోట్లకు గురికాకుండా ఉండేందుకు ఓ ప్రత్యేక పరిస్థితుల్లో కల్పించిన సదుపాయం మాత్రమేనని, హక్కు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకం కోసం ఓ మహిళ చేసిన విజ్ఞప్తిని పరిగణ నలోకి తీసుకోవాలని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును, దాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ.. సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మహిళ తండ్రి 1995లో ఉద్యోగంలో చనిపోయా రని, ఆ సమయానికి కేరళ రాష్ట్ర ఆరోగ్య సేవల విభాగంలో తల్లి ఉద్యోగి అని.. అందుకే అప్పుడు ఆ కుటుంబాన్ని కారుణ్య నియామకానికి పరిగణ నలోకి తీసుకోలేదన్న విషయాన్ని జస్టిస్ ఎం. ఆర్. షా, జస్టిస్ కృష్ణమురారిల ధర్మాసనం ప్రస్తావించింది. ఆ సమయంలో మైనర్ గా ఉన్న కుమార్తె 14 ఏళ్ల తర్వాత కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆకస్మిక సంక్షోభంతో బాధిత కుటుంబం ప్రభా వితం కాకూడదన్నదే కారుణ్య నియామకాల వెనుక ఉద్దేశమని.. అది ఓ సదుపాయం మాత్రమేనని న్యాయమూర్తులు తెలిపారు.

నీట్ పీజీ కన్వీనర్ కోటా ప్రవేశాల జాబితా వెల్లడి

🌻ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పేజీ ఎండీ/ఎంఎస్ సీట్లకు సంబంధించి కన్వీనర్ కోటా ప్రవేశాల జాబితాను సోమవారం విజయవాడ లోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ విద్యా సంవత్సరానికి.. మొత్తం 2,513 సీట్లకు గాను జాతీయ కోటా పోను మిగి లిన వాటిలో సర్వీస్ కేటగిరీలో 266 మందికి, నాన్-సర్వీస్ కోటాలో 822 మందికి సీట్ల కేటాయించినట్లు రిజిస్ట్రార్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలి పారు. అభ్యర్థులు ఈ నెల 8వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ఆయా కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోటాలో సీట్లు పొందిన వారు కళాశాలల్లో చేరే గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించారు.

జాతీయ కోటా వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్ 11 నుంచి

ఈనాడు, న్యూస్: ఎంబీబీఎస్, బీడీఎస్ అఖిల భారత స్థాయి సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 11 నుంచి, తెలంగాణలో సీట్లకు 17 నుంచి కౌన్సె లింగ్ ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 15 నుంచి తొలి ఏడాది వైద్యవిద్య తరగతులు ప్రారంభం కావాలని సూచించింది.

డి.ఎ బకాయిలను విడుదల చేయాలి.

యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు

పెండింగ్లో ఉన్న 2 డిఎలను విడుదల చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమావారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 11వ పిఆర్సి తర్వాత కేంద్రం రెండు డిఎలు ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటి కూడా ప్రకటించలేదన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని ప్రకటనలు చేస్తూ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటే మాత్రం ఆర్థిక ఇబ్బందులని చెబుతున్నారని విమర్శించారు. గతంలో ఉన్న డిఎల బకాయిలు ఉపాధ్యాయుల, ఉద్యోగుల అకౌంట్లలోకి రాకుండానే ఇస్కం ట్యాక్స్ చెల్లించిన పరిస్థితి ఉందన్నారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు 2009 నుంచి రావాల్సిన డిఎ ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయని, సిపిఎస్ -ఉద్యోగులు డిఎ నగదు బకాయిలు కూడా ఇంత వరకూ చెల్లించలేదని తెలిపారు. ఉద్యోగుల బకాయిలను పెండింగ్లో పెట్టి ఆర్ధిక ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. పిఆర్సి చర్చల సందర్భంగా తదుపరి ఆర్ధిక శాఖ అధికారులతో చర్చల సందర్భంగా బకాయిలు 2. నెలల్లో చెల్లిస్తామని చేసిన వాగ్దానం అమలు చేయాలని కోరారు. యుటిఎఫ్ ప్రచురణల విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ. పాఠశాలల ప్రారంభానికి ముందే బదిలీలు, ప్రమోషన్లు పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి మూడు నెలలు గడిచినా వాటిపై స్పష్టమైన విధానం ప్రకటించలేదన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు బి.ఆదిలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఎం. కళాధర్, జిల్లా కార్యదర్శి సిహెచ్. ఆదినారాయణ, ఆడిట్ కమిటీ సభ్యులు ధనరాజారావు పాల్గొన్నారు..

స్కూళ్లలో ఇక క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్

పక్కాగా తరగతి పురోగతి
పాఠశాలల పరీక్షా విధానంలో కీలక మార్పులు
1-8 తరగతులకు ఓఎమ్మార్ షీట్లతో పరీక్షలు
ఫార్మేటివ్, సమ్మేటివ్ స్థానంలో సీబీఏ టెస్ట్
మైనర్ మీడియం స్కూళ్లలో పాత పద్ధతిలోనే
9, 10 తరగతులకూ పాత విధానమే
నవంబర్ 2 నుంచి పరీక్షలు.. ఏటా 3 సార్లు
మార్గదర్శకాలతో సర్క్యులర్ జారీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించడం, సరైన బోధనతో సంపూర్ణ సామర్ధ్యాలు సంతరించుకోవడమే లక్ష్యంగా పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ విధానానికి శ్రీకారం చుడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త విధానం అమలు లోకి రానుంది. పాఠశాలల్లో ప్రమాణాలుమెరుగుపర్చేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారంతో అమలు చేస్తున్న 'సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్' (సాల్ట్) కార్యక్ర మంలో భాగంగా తరగతి గది ఆధారిత మూల్యాం కన విధానాన్ని తెస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు సీబీఏ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఏపీ ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ డాక్టర్ బి.ప్ర తాపరెడ్డి తెలిపారు. ఈమేరకు సీబీఏ మార్గదర్శకాలు, షెడ్యూల్లో సోమవారం సర్క్యులర్ జారీ అయింది. ఈ పరీక్షలు పూర్తిగా ఓఎమ్మార్ (ఆప్టికల్ మార్కు రికగ్నిషన్) విధానంలో ఏడాదికి మూడు సార్లు జరుగుతాయి. తొలివిడత పరీక్షలు నవంబర్2 నుంచి ప్రారంభమవుతాయి.

ఈఐతో ఎస్సీఈఆర్టీ ఎంవోయూ
నూతన విధానంలో పరీక్షా పత్రం రూపకల్పన, మూల్యాంకనం కోసం 'ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్' (ఈఐ)తో ఎస్సీఈఆర్టీ ఎంవోయూ కుదుర్చుకుం ది. దీని ప్రకారం 1 8 తరగతుల విద్యార్థులకు ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు), సెకండ్ లాంగ్వేజ్ (హిందీ), థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీషు). ఈవీఎస్. గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టుల్లో సీబీఏ పరీ క్షలు నిర్వహిస్తారు. ఫిజికల్, బయోలాజికల్ సైన్స్క కలిపి ఒకే పేపర్ ఉంటుంది. ప్రశ్నపత్రాలు బైలింగ్యువల్ (ద్విభాషా) పద్ధతిలో
రూపొందిస్తారు. పక్కా మూల్యాంకనం ద్వారా విద్యార్థుల సామర్ధ్యాలను కచ్చితంగా గుర్తించి లోటుపాట్లను సరిదిద్దడంపై ఈ ఐ సంస్థ నివేదిక అందిస్తుంది. బోధనా విధానాలపై ఎస్సీఈఆర్టీకి సిఫార్సు చేస్తుంది. వాటి ఆధారంగా ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకుంటారు.

ఫార్మేటివ్, సమ్మేటివ్ స్థానంలో

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఫార్మేటివ్, సమ్మేటివ్ పరి క్షల స్థానంలో సీబీఏ పరీక్షలను నిర్వహిస్తారు. 1-8 తరగతులకు సంబంధించిన 1, 3 ఫార్మేటివ్, సమ్మే టివ్ 2 బదులు సీబీఏ పరీక్షలు ఉంటాయి. ఫార్మేటివ్ 2, 4, సమ్మేటివ్ 1 పరీక్షలను యదాత భంగా పాత విధానంలోనే నిర్వహిస్తారు. విద్యా ర్థుల సామర్ధ్యాలను సంపూర్ణంగా అంచనా వేసేలా ఈఐ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలను అనుస రించి ప్రశ్న పత్రాన్ని రూపొందిస్తుంది. ఓఎమ్మార్ విధానంలో తొలిసారి నిర్వహిస్తున్నందున టీచర్లకు చెబినార్ల ద్వారా సూచనలు అందించనున్నారు.

9, 10 పాత విధానంలోనే

గతంలో మాదిరిగానే 9, 10 తరగతుల విద్యా ర్థులకు అంతర్గత పరీక్షలను నాలుగు ఫార్మేటిష్ రెండు సమ్మేటివ్లతో పాత విధానంలో నిర్వహి స్తారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో పేపర్ల సంఖ్యను ప్రభుత్వం కుదించడంతోపాటు అంతర్గత మార్కులతో సంబంధం లేకుండా ప్రతి పేపర్ను 100 మార్కులకు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కన్నడ, తమిళం, ఒడియా తదితర మైనర్ మీడియం స్కూళ్లలో మాత్రం 1-8 తరగ
తుల విద్యార్థులకు సీబీఏ తరహాలో కాకుండా పాత విధానంలోనే ఫార్మేటివ్ సమ్మేటివ్ పరీక్షలు ఉంటాయి.

ప్రైవేట్ స్కూళ్లకు ఓఎమ్మార్ పంపిణీ ఉండదు.
సీబీఏ పరీక్షల ఓఎమ్మార్ పత్రాలను ప్రభుత్వ స్కూ ళ్లలో చదివే విద్యార్థులకు మాత్రమే పంపిణీ చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు డీసీఈబీ (డిస్ట్రిక్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు) నుంచి ప్రశ్నప త్రాలను అందుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈఐ సంస్థ విడుదల చేసే '' ఆధా రంగా ప్రైవేట్ స్కూళ్లలో మూల్యాంకనం చేసి మార్కులను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి.

రూ.15,000కే లాప్‌టాప్‌!

త్వరలో విడుదల చేయనున్న రిలయన్స్‌ జియో

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో రూ.15,000కే లాప్‌టా్‌పను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. జియో బుక్‌ పేరుతో కంపెనీ దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టనుందని.. దేశంలోని అత్యంత చౌక లాప్‌టాప్‌ మోడళ్లలో ఒకటి కానుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 4జీ సిమ్‌కార్డుతో కూడిన జియో బుక్‌ను ఈ నెలలోనే పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలకు అందుబాటులోకి తేనున్నట్లు వారు వెల్లడించారు. వచ్చే మూడు నెలల్లో కంపెనీ దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనుందన్నారు.

క్వాల్‌కామ్‌ చిప్స్‌, జియోఓఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో దేశీయంగా తయారు చేస్తున్న జియో బుక్‌లో మైక్రోసా్‌ఫ్టకు చెందిన కొన్ని యాప్‌లు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. జియో ఫోన్‌ పేరుతో రిలయన్స్‌ లాంచ్‌ చేసిన అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌కు మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఇక లాప్‌టా్‌పల విభాగంలోనూ అదే తరహా విజయాన్ని దక్కించుకోవాలని రిలయన్స్‌ జియో భావిస్తోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశీయ ల్యాప్‌టాప్‌ మార్కె ట్లో వార్షిక విక్రయాలు 1.40 కోట్ల యూనిట్ల స్థాయిలో ఉన్నాయని.. జియో బుక్‌ ప్రవేశంతో సేల్స్‌ మరో 15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని కౌంటర్‌పాయింట్‌ అనలిస్ట్‌ తరుణ్‌ పాథక్‌ అభిప్రాయపడ్డారు. ఈ మార్కె ట్లో హెచ్‌పీ, డెల్‌ కంపెనీలదే హవా. కాగా, ఏసర్‌, లెనెవో, లావా వంటి కంపెనీలు తక్కువ ధరలో లాపీలను విక్రయిస్తున్నాయి. జియో బుక్‌ ప్రఽధానంగా ఈ మూడు కంపెనీల మోడళ్లకు గట్టిపోటీనివ్వనుందని పాథక్‌ పేర్కొన్నారు.
Previous Post Next Post

Contact Form