మచిలీపట్నంలోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ విధానంలో పట్టణలోని జీఎంసీ, జీజీహెచ్, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 164 ఖాళీలను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ పోస్టుల భర్తీకి నవంబరు 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Tags
Jobs