Telugu Educational News 29th Sep 2022

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు...4% డీఏ పెంపు 

జూలై 1 నుంచి వర్తింపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), 4 శాతం పెంచుతూ కేంద్ర కేబి నెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని 41.85 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది ఫించనుదారు లకు లబ్ధి చేకూరుతుంది. మూల వేతనంపై 34శాతంగా ఉన్న డీఏకి అదనంగా 4% పెంచడంతో 38శాతానికి చేరుకుంది. ఈ పెంపుతో ఖజానాపై ఏడాదికి 12.852 కోట్ల అదనపు భారం పడుతుంది.

ఇంటర్‌ రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలు విడుదల

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండియర్‌ జనరల్‌, వొకేషనల్‌ కోర్సుల సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీవెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలను ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచామని బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు తెలిపారు.

యూనిఫాం ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు

యూనిఫాం సర్వీసుల్లో నియామకాలకు వయోపరిమితి రెండేళ్ల పెంపుదలను 2023 సెప్టెంబరు 30 వరకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ, ఇతర సంస్థలు చేపట్టే డైరెక్ట్‌ నియామకాల్లో యూనిఫాం సర్వీసులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల గడువు 2021 సెప్టెంబరు 30తో పూర్తయింది. తాజా ఆదేశాలతో ఈ పరిమితి రెండేళ్లు పెరగనుంది. ఒక్కో కేటగిరీకి ఒక్కో రకంగా వయోపరిమితి ఉంటుంది.

గ్రూప్‌-1 ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూలు

♦️లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకూ వర్తింపచేస్తూ ఉత్తర్వులు
అమరావతి, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌-1 సర్వీసులు, వాటికి సమానమైన పోస్టులు, లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తదితర పోస్టులకు మౌఖిక ఇంటర్వ్యూలు/ పర్సనాలిటీ టెస్ట్‌లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని గ్రూప్‌-1 నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దుచేయగా, వాటిని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీపీఎస్సీ ప్రతిపాదించడంతో ప్రభుత్వం కమిషన్‌కు చెందిన ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటుచేసింది. దీనిపై కమిటీ సభ్యులు కె.విజయ్‌కుమార్‌, ప్రొఫెసర్‌ కె.పద్మరాజు, ఎస్‌.సలాంబాబు, ఏవీ రమణారెడ్డి, పి.సుధీర్‌ అధ్యయనం చేసి ఆగస్టు 25న నివేదిక అందించారు. గ్రూప్‌-1తో పాటు ఇతర ఉన్నత ఉద్యోగాల ఎంపికలో పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహించాలని కమిటీ ఆ నివేదికలో పేర్కొంది. దీంతో ప్రభుత్వం ఏపీపీఎస్సీ నిర్ణయాన్ని సమర్థించింది

269 ఉద్యోగాల భర్తీకి 9 నోటిఫికేషన్లు

 జారీ చేసిన ఏపీపీఎస్సీ
అమరావతి: 269 ఉద్యోగాల భర్తీకి ఎపీపీ ఎస్సీ బుధవారం 9 నోటిఫికేషన్లను జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ తేదీలను ప్రకటించింది. 72 ఆయు ర్వేద వైద్యులు, 53 హోమియో వైద్యులు, 26 యునాని వైద్యులు, 34 హోమియో లెక్చరర్స్, మూడు ఆయుర్వేద లెక్చరర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి విడివిడిగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. 11/2022 నోటిఫికేషన్ కింద ఏపీ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ సబ్ సర్వీస్లో 12 శాంపిల్ టేకర్, 8 ఫుడ్సేఫ్టీ ఆఫీ సర్, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, ఇతర పోస్టులు కలిపి 45 ఉన్నాయి. 23 అసిస్టెంట్ ఎగ్జి క్యూటివ్ ఇంజినీర్స్, ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రెండు నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ జారీచేసింది. 06/2022 నోటిఫికేషన్ కింద ఆరు పోస్టులను గ్రూప్-4 కేటగిరీలో భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయి.

నేడు ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల

నూజివీడు: రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ. వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హులైన అభ్యర్థుల జాబితాను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలో ఉదయం 10.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం 44.208 దరఖాస్తులొచ్చాయని, ఈ నెల 19 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అక్టోబర్ 12 నుంచి 15 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి, 17 నుంచి తరగతులు ప్రారంభిస్తామని వివరించారు.

♦️కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని4 ట్రిపుల్ ఐటీలకు నిర్వహిస్తున్న అడ్మిషన్లలో భాగంగా స్థానిక ట్రిపుల్ ఐటీలో బుధవారం పలు కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ను నిర్వహించారు. ఎన్సీసీ, స్పోర్ట్స్, వికలాంగుల, సైనిక ఉద్యోగుల పిల్లల కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు.30వ తేదీ వరకు పరిశీలన కొనసాగనుంది.

30న కెజిబివి ఉద్యోగుల రాష్ట్రస్థాయి ధర్నా

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో సమగ్ర శిక్ష, కెజిబివిల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, పార్టంతోపాటు అన్ని కేడర్లకు చెందిన 25 వేలమంది ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 30న విజయవాడలోని స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు ఎం బాలకాశి తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. టైమ్ స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. 2018లో కేటాయించిన వేతనాలపైనే ఉద్యోగులు బతుకులీడుస్తున్నారని, వెంటనే వేతనాలు సవరించాలని కోరారు.

సిపిఎస్ రద్దు కోరుతూ..డిసెంబరులో 'చలో పార్లమెంటు'

♦️ఎస్ టీ ఎఫ్ఐ పిలుపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించాలని, పాత పెన్షన్ | విధానాన్ని కొనసాగించాలని డిసెంబరులో చలో పార్లమెంటు కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టిఎఫ్ఐ) జాతీయ అధ్యక్షులు కెసి హరికృష్ణన్, జాతీయ ప్రధాన కార్యదర్శి సిఎన్ భారతి పేర్కొన్నారు. చలో పార్లమెంటు కార్యక్రమాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో కోల్కతాలో జరిగిన జాతీయస్థాయి సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని,ఇందుకు భిన్నంగా NEP-2020 ద్వారా విద్య కార్పొరేట్లకు అప్పజెప్పడంతో ఉన్నత వర్గాలకు మాత్రమే విద్య అందుతుందని, పేదలు విద్యకు దూరమయ్యే ప్రమాదముందని అన్నారు. ఇప్పటికే బడి ఈడు పిల్లలు 2 కోట్ల మంది బడి బయట ఉన్నారని కోరుతూ.. తెలిపారు. భవిష్యత్తులో కొన్ని తరగతుల వారు పాఠశాలల గడప వరకు కూడా రాని పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందన్నారు. ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పించాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలిపెట్టి ప్రపంచీకరణలో భాగంగా 2004 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. ఫలితంగా ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక సహకారం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ఐ జాతీయ స్థాయి నాయకత్వంతోపాటు యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్ కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి ఎ అరుణకుమారి పాల్గొన్నారు.
Previous Post Next Post

Contact Form