Telugu Educational News 1st Oct 2022

మండలానికిద్దరు ఎంఈవోలపై 20వ తేదీ వరకు ముందుకెళ్లొద్దు

రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విచారణ అక్టోబరు 20కి వాయిదా


సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలానికి ఇద్దరు విద్యాధికారుల నియామకంపై అక్టోబరు 20 వరకు ముందుకెళ్లవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఆ తేదీకి వాయిదా వేస్తూ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 16న జారీ చేసిన జీవో 154ని సవాల్‌ చేస్తూ జడ్పీ హైస్కూళ్లలో పనిచేస్తున్న పలువురు ప్రధానోపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఈ జీవో రాష్ట్రపతి ఉత్తర్వుకు విరుద్ధమని, అదనపు ఎంఈవో పోస్టుల సృష్టికి రాష్ట్రపతి ఉత్తర్వు తప్పనిసరని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 250 మంది హెడ్మాస్టర్లను ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలతో ఎంఈవోలుగా నియమించిందన్నారు. జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న హెడ్మాస్టర్లను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని.. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వారిని పూర్తిస్థాయి ఎంఈవోలుగా నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అదే జరిగితే జడ్పీ హైస్కూళ్లలో పనిచేసేవారు ఎంఈవోలుగా పదోన్నతి పొందే అవకాశం పోతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల ఉపాధ్యాయులను సమీకృత సర్వీసులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించగా హైకోర్టు తప్పుబట్టిందని గుర్తుచేశారు.

రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించకుండా ఉద్యోగుల సర్వీసును మార్చేందుకు గానీ, అదనపు పోస్టులు సృష్టించే అధికారం గానీ ప్రభుత్వానికి లేవన్నారు. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేస్తూ.. పిటిషనర్లది ఊహాజనిత ఆందోళన మాత్రమేనని.. పాఠశాలల్లో మెరుగైన సేవలు అందించేందుకే అదనపు పోస్టులు సృష్టించామని తెలిపింది. అదనపు పోస్టులు సృష్టించేందుకు రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరమా కాదా అని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కాసా జగన్మోహన్‌రెడ్డిని హైకోర్టు ప్రశ్నించగా.. ఆయన నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. ఈ సందర్భంగా ఎస్‌జీపీ కోర్టుపై అనవసరమైన వాఖ్యలు చేశారని.. అవి తీవ్ర అభ్యంతరకరమని న్యాయస్థానం తన ఉత్తర్వులో పేర్కొంది.

పదోన్నతులకు సర్వీసు లెక్కింపుపై స్పష్టత

అమరావతి: స్కూల్ అసిస్టెంట్లకు ప్రధా నోపాధ్యాయులు గ్రేడ్-2గా, సెకండరీ గ్రేడ్ టీచర్స్కు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులకు ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్స్ 33ను పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ విషయంలో కొందరు డీఈవోల సందేహాలకు స్పష్టతనిచ్చింది. ఒక సర్వీసు, కేటగిరీ, గ్రేడులో నియామక తేదీ నుంచే ఉద్యోగి సీనియారిటీ నిర్ధారిస్తారు. ఒక సర్వీసుకు ఏకకాలంలో ఇద్దరి కన్నా ఎక్కువమందిని నియమిస్తే వారి ఆర్డర్ ప్రిఫరెన్సు నిర్దేశించాలి. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీ, పీజీటీల సీనియారిటీ జాబితాను అక్టోబరు 20లోపు రూపొందించాలని, ఈ జాబితాను 30లోపు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కు అందించాలని పేర్కొంది.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతకే విద్యాంజలి 2.0

ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత గల విద్యని అందించడానికి విద్యాంజలి 2.0, స్వచ్ఛంద సేవల కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టామని, దీన్ని జయప్రదం చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 7, 2021న ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రకటించారని, ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని పౌరులందరూ తమకు నచ్చిన రంగంలో సమీప పాఠశాలలకు స్వచ్ఛంద సేవలు అందించవచ్చునని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో విద్యానాణ్యతని పెంపొందించుకోవడానికి ఆర్జెడీలు జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా అదనపు సమన్వయకర్తలు,ప్రధానో పాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కార్యవుర్గ, తల్లిదండ్రులు విద్యాం జలి 2.0, కార్యక్రమాన్ని సత్వరమే అమలు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ పాఠశాలకు కావలసిన విద్యా వనరులను, సామాగ్రిని మధ్యాహ్న భోజన పథకం, నీటి వసతి, స్వయం ఉపాధి కోర్సుల నిర్వహణ, కంప్యూటర్ బోధన, అదనపు తరగతి గదులు, బోధన అభ్యసన సామాగ్రి, స్పోర్ట్స్ మెటీరియల్,కంప్యూటర్లు మొదలైన అంశాలన్నిటిలోనూ వారి వారి అవసరాలని విద్యాంజలి పోర్టల్ లో పాఠశాల తరఫున నమోదు చేసుకుని, పాఠశాల అవసరాలకు ఆధారంగా స్వచ్ఛంద కార్యకర్తలు కూడా తాము అందజేయగలిగినటువంటి సేవలను విద్యాంజలి పోర్టల్ లో నమోదు చేసుకుని ఆయా పాఠశాలలకు అందించాలని కోరారు.

పాఠశాల విద్యాశాఖ సలహాదారు రాజీనామా

పాఠశాల విద్యాశాఖలో మౌళి కసదుపాయలకల్పనకు సలహాదారుగా ఉన్న ఎ.మురళీతన పదవికి రాజీనామా చేశారు. ఈమేరకు సిఎం జగన్కు లేఖ రాశారు. తన స్వంత రాష్ట్రమైన తెలంగాణలో విద్య, వైద్య రంగాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అక్కడి పరిస్థితులను మెరుగుపరిచేందుకు తాను తెలంగాణలో పనిచేయాలని భావిస్తున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని అన్నారు. సిఎం జగన్ పాఠశాల విద్యాశాఖకు ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమానికి అధిక ప్రాధన్యత ఇచ్చారని, ఇక్కడి పరిస్థితులు మెరుగయ్యాయని మురళీ అన్నారు. ఇదే సమయంలో తన రాష్ట్రమైన తెలంగాణలో విద్య,వైద్య రంగంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, అక్కడ తన అవసరం ఉందని సిఎం జగన్ కు రాసిన లేఖలో మురళీ వివరించారు.

పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ షురూ

ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 2023 మార్చి 29వ తేదీన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాంల ముగియనుండటంతో ఓటర్ల ప్రక్రియ షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియకు బహిరంగ ప్రకటన జారీ చేయాలని ఎన్నికల ప్రధాన అధికారికి ఆదేశాలు జారీ అయ్యాయి. 2022 నవంబర్ 7వ తేదీ నుంచి ఫామ్ 18 ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని సూచనలు అందాయి. 2022 నవంబర్ 23వ తేదీ నాటికి ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించాలని స్పష్టం చేసింది. 2022 డిసెంబర్ 30 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా రూపొందించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

గ్రూపు-1 ఉద్యోగాలకు మాత్రమే ఇంటర్వ్యూలు!

అమరావతి: గ్రూపు-1 పోస్టుల భర్తీకి మాత్రమే మౌఖిక పరీక్షలను పరిమితంచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గత నెల 28న జారీచేసిన ఉత్తర్వుల్లో గ్రూపు-1 ఉద్యోగాలతోపాటు లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కూడా ఇంటర్వ్యూలను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. తాజా గ్రూపు-1 ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల గురించి ప్రస్తావించలేదు.

ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణలో ఇష్టారాజ్యం

అమరావతి: ప్రైవేటు డిగ్రీ కళాశాలల అనుమతుల పునరుద్ధరణ వ్యవహారం గందరగోళంగా మారింది. కళాశాలల రెన్యువల్ను నిలిపివేసిన అధికారే హడావుడిగా అర్ధరాత్రి మళ్లీ కొన్నింటి అనుమతు లను పునరుద్ధరించాలని వర్సిటీలపై ఒత్తిడి తీసుకురావడం చర్చనీయాంశమైంది. ఉన్నత విద్యాశాఖకు చెందిన ఓ కీలక అధికారి, ఆయన వద్ద నుండే పొరుగు సేవల ఉద్యోగి తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తరచూ మారుతున్న అధికారుల నిర్ణయాలకు తోడు ఆన్లైన్ సాంకేతిక లోపాల కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి డిగ్రీ ఆన్లైన్ కౌన్సెలింగ్ రెండు నెలలైనా ఇంకా కొన సాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,033 ప్రైవేటు డిగ్రీ కళాశా ఉన్నాయి. విశ్వవిద్యాలయాలే అనుమతులను పునరుద్ధరించి, కోర్సులు, సీట్ల వివరాలను ఈ లేఖలో అందించాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా జులైలోనే వర్సిటీలు చర్యలు చేపట్టాయి. ప్రైవేటు కళాశాలల్లోని సదుపాయాలు, అధ్యాపకుల అర్హతలను ఆన్లైన్లో ఉంచారు. ఆగస్టు నెల చివరిలో కళాశాలల్లోని సదుపాయాలను ఆన్లై న్లో పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ అధికారి సదుపాయాలు లేని వాటిల్లో మరోమారు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆ విధంగా 200 కళాశాలల జాబితాలను సంబంధిత వర్సిటీలకు పంపించారు. వీటిని పరిశీలించిన అనంతరం 150 కళాశాలలకు సంబంధించిన అనుమతుల పునరుద్ధరణ నిలిపివేయాలని ఉన్నతాధికారి ఆదేశించారు. వర్సిటీలు పాలకవర్గ సమావేశాల్లో ఈ జాబితాలను పెట్టి ఆమోదం తీసుకున్నాయి. ఇక్కడి వరకు బాగానే సాగింది. ఇప్పుడు ఆ ఉన్నతాధికారే అర్ధరాత్రి కొన్ని కళాశాలలకు అనుమతులు ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని ఒక కళాశాల ప్రైవేటు భవనంలో నుంచి మరో ప్రైవేటు భవనంలోకి ఎలాంటి అనుమతులు లేకుండా మారిపోయింది. ఈ కళాశాలలో అనేక లోపాలున్నట్లు గుర్తించి ఆపేశారు. ఆ ఉన్నతాధికారి హడావుడిగా ఈ కళాశాలను పేరును ఆన్లైన్లో అప్లోడ్ చేయించారు. గత రెండు రోజుల్లోనే 9 కళాశాలలను ఆన్ లైన్ లో పెట్టాలని ఆయన ఆదేశించడం గమనార్హం. ఆంధ్ర విశ్వవిద్యా లయం పరిధిలోని విజయనగరంలో రెండు కళాశాలలను ఆన్లైన్ జాబి తాలో పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. మరో పక్క కృష్ణా జిల్లాలోనే సొంత భవనంలో ఉన్న ఓ కళాశాలకు రెండెకరాలు స్థలం లేదని ఆపివేయడం పైనా విమర్శలు వస్తున్నాయి. ఇలా... మొత్తం 150 కళాశాలల్లో తొమ్మిం దింటికి అనుమతులు ఇవ్వడంతో మిగిలిన 141 కళాశాలలకు ఆపేయ డంతో ఈ ఏడాది దాదాపు 45 వేల డిగ్రీ సీట్లు తగ్గనున్నాయి.

♦️కనిపించని కోర్సులు: వెబ్సైట్లో కొన్ని కళాశాలల్లో కోర్సులు కనిపించకపోవడం లాంటి ఘటనలతో విద్యార్థులు ఆందోళన చెందుతు న్నారు. వర్సిటీల వద్ద అనుమతుల పునరుద్ధరణ సాఫ్ట్వేర్ వర్క్ను సీఎఫ్ఎస్ఎస్ చేస్తుండగా.. వెబ్ ఐచ్ఛికాలను ఏపీ ఆన్లైన్ చేస్తోంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఏపీ టెట్లో 150కి 151 మార్కులు!

ఈనాడు, అమరావతి: ఏదైనా పరీక్ష 150 మార్కులకు రాస్తే ఎన్ని వస్తాయి? గరిష్ఠంగా 150 లేదా అంతకంటే తక్కువ మార్కులు వస్తాయి. అయితే... పాఠశాల విద్యాశాఖ నిర్వ హించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో 150కి 151 150.86, 150.64, 150.26, మార్కులు వచ్చాయి. ఇదేంటి? అని అనుకుంటున్నారా? అధికారులు నిర్వహించిన నార్మలైజేషన్ విధానంతో ఈ పరిస్థితి ఏర్పడింది. టెట్ ఫలితాలను శుక్రవారం వెబ్సైట్లో ఉంచారు. గరిష్ఠం కంటే ఎక్కువ మార్కులు రావడంతో వాటిని చూసి అభ్యర్థులు సైతం ఆందోళనకు గురయ్యారు. ఇలా ఒక్కరికో ఇద్దరికో కాదు.. దాదాపు 8 మంది ఎస్జీటీ పరీక్ష రాసిన విద్యార్థులకు ఇదే రీతిలో ఫలి తాలు వచ్చాయి. టెట్ పరీక్షను ఈ ఏడాది కంప్యూటర్ ఆధారిత విధానంలో 16 రోజుల పాటు నిర్వహించిన పరీక్షలకు 4,07,329 మంది హాజరయ్యారు. ఇన్ని రోజుల పరీక్షల్లో ఒక రోజు ప్రశ్నపత్రం కఠినంగా.. మరొక రోజు తేలికగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తారు. ఏపీ ఈఏపీసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్ లాంటి వాటిల్లోనూ ఇదే విధానాన్ని పాటిస్తారు. నార్మలైజేషన్ చేసే సమయంలో గరిష్ఠ 150 మార్కుల కంటే ఎక్కువ వచ్చినా వాటిని 150కే పరిమితం చేయాలి. పాఠశాల విద్యాశాఖ మాత్రం ఫలితాల విడుదలలో ఎలాంటి పరిశీలన చేసుకో కుండానే 150కి 151 మార్కులను ఇచ్చేసింది. కఠిన ప్రశ్నపత్రంలోనూ ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు 150కంటే ఎక్కువ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ప్రశ్నపత్రం తేలికగా ఉన్న వారికి ఎక్కువ మార్కులు వస్తే కఠినంగా వచ్చిన వారికి అదనంగా మార్కులు కలుస్తా యని, ఇలాంటి సమయంలో ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అభ్యర్థులకు మళ్లీ ప్రత్యేకంగా 150 మార్కులను మాత్రమే ఇస్తామని ప్రకటిం మంది చారు. ఎస్జీటీకి పేపర్-1ఏ, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలల్లో 1-5 తరగతుల బోధనకు పేపర్-బీ, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2ఏ, ప్రత్యేక ఉపాధ్యాయులకు పేపర్-2బీ పెట్టారు. ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహించారు.

92 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అమరావతి: ఏపీపీఎస్సీ గ్రూప్- 1 (జనరల్ మిటెడ్ రిక్రూట్మెంట్)లో 92 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అక్టోబర్ 13 నుంచి నవంబర్ 2 వరకు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపింది.రవాణాశాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహి కల్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని, నవంబర్ 2 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకో వాలని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ ముఖఆధారిత హాజరు

 గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికీ శనివారం నుంచి ముఖ ఆధారిత హాజరు నమోదు చేయను న్నారు. ఇక ఉద్యోగులు సంబంధిత యాప్ను సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోని హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యా శాఖలో అమలవుతున్న ఈ విధానం వీరికీ అమలు చేస్తున్నారు.

విదేశీ విద్యార్థులకు 25 శాతం సీట్లు

♦️ఉన్నత విద్యాసంస్థల్లో సూపర్ న్యూమరరీ కోటా కింద ఇచ్చుకోవచ్చు
♦️ప్రవేశాల మార్గదర్శకాలను జారీ చేసిన యూజీసీ


దేశంలోని యూజీసీ గుర్తింపు పొందిన అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు యూజీ, పీజీ కోర్సుల్లో విదేశీ విద్యార్థులకు 25 శాతం సీట్లను సూపర్ న్యూమరరీ కోటా కింద కేటాయించ వచ్చు. అంటే ఇప్పుడున్న సీట్లకు అవి అదనం. ఈ మేరకు ప్రవేశాల పై యూజీసీ మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచాలని నూతన జాతీయ విద్యావిధానంలో నిర్ణయించారు. ఈక్ర మంలోనే యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కళా శాలలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో 500 సీట్లు ఉంటే వాటికి అద నంగా 125 సీట్లను విదేశీ విద్యార్థులకు కేటాయించుకో వచ్చు. ఒకవేళ అందులో మిగిలిపోతే వాటిని ఇతరులకు కేటాయించరాదు. ఆ సీట్లను విదేశీ పాస్పోర్ట్ ఉన్న విద్యార్థులకే ఇవ్వాలి. విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే ఉన్నత విద్యాసంస్థలు అంతర్జాతీయ విద్యార్థుల కార్యాలయాన్ని కలిగి ఉండాలి. విద్యార్థుల దేశం, మొబైల్ నంబరు, కోర్సు, దాని వ్యవధి వివరాలను వెబ్సైట్లో ఉంచాలి. ఏయే కోర్సుల్లో విదేశీ విద్యార్థులకు ఎన్ని సీట్లు ఉన్నాయి? వార్షిక ఫీజు, ప్రవేశాల విధానం, అర్హత నిబం ధనలను కూడా కళాశాల/ వర్సిటీ వెబ్సైట్లో పొందుపర చాలి. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు కేంద్ర విద్యా శాఖ 2018లోనే స్టడీ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆ వెబ్సైట్ ద్వారా విదేశీ విద్యార్థులు భారత్లోని వివిధ సంస్థల్లో చేరొచ్చు.

‘టెట్‌’ ఆశలు ఆవిరి!

కొందరికి నూరుశాతానికి పైగా మార్కులు .. ఆపై దిద్దుబాటు
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)పై అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంతో ఏకంగా 1,18,474 మంది పరీక్షలకు దూరమయ్యారు. వీరంతా రూ.500 చొప్పున చెల్లించిన దరఖాస్తు రుసుము దాదాపు రూ.6 కోట్లు వృథాగా మారింది. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అభ్యర్థులు పరీక్షలకు దూరం కాలేదు. 2018 తర్వాత నిర్వహిస్తుండటంతో ఈ ఏడాది ఆగస్టులో జరిగిన టెట్‌కు ఏకంగా 5,25,803 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాఠశాల విద్యాశాఖ కేవలం 150 పరీక్ష కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసింది. వీటిలో చాలావరకూ ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉండటంతో ఏపీలో కేంద్రాలు దొరకని వారు పరీక్షలు రాయలేకపోయారు.
 
ఐదుగురికి 150 మార్కులు
ఈ ఏడాది టెట్‌ రాసిన 4,07,329 మందిలో 2,36,535 (58.07ు) మంది అర్హత సాధించారు. వారిలో ఐదుగురికి 150 మార్కులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జనరల్‌ అభ్యర్థులకు 60శాతం, బీసీ అభ్యర్థులకు 50శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీ్‌సమన్‌ కోటా అభ్యర్థులకు 40శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు. పరీక్షలకు ఎక్కువ సమయం ఇవ్వకపోవడంతో చాలామంది అనర్హులుగా మిగిలిపోయారు. మరోవైపు టెట్‌ ఫలితాల్లో వింతలు చోటుచేసుకున్నాయి. 150 మార్కులకు పరీక్ష నిర్వహించగా కొందరికి నూరు శాతానికి పైగా మార్కులు రావడంతో అభ్యర్థులు కంగుతిన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన వడ్ల మంజుల 150కి గాను 150.26958 మార్కులు వచ్చాయి. మరో అభ్యర్థికి 150.86, ఇంకొకరికి 15.64 మార్కులు రావడంతో వారిలో ఆందోళన మొదలైంది. సాయంత్రానికి వీటిని సరిదిద్దడంతో ఊపిరి పీల్చుకున్నారు.

బడికెళ్లే బాలలు తగ్గుతున్నారు

♦️దేశవ్యాప్తంగా స్కూళ్లలో చేరికలపై జనాభా తగ్గుదల ప్రభావం
♦️ఎన్సీఈఆర్టీ నివేదికలో వెల్లడి
♦️2011 నుంచి పడిపోతున్నఒకటో తరగతి చేరికలు
♦️చేరికల్లో 9.47 శాతం మేర తగ్గుదల
♦️2025 నాటికి తగ్గుదల14 శాతం ఉంటుందని అంచనా
♦️2025కి బాలురు 13.28 శాతం, బాలికలు15.54 శాతం తగ్గవచ్చని అంచనా
♦️ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపవుట్స్ లేకుండాప్రత్యేక చర్యలు

అమరావతి: దేశవ్యాప్తంగా పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రైమరీ, ఒకటో తరగతి నుంచే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇందుకు జనాభా తగ్గుదలే కారణమని నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకే షన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) నివేదిక వెల డించింది. మరోపక్క కరోనా తదనంతర పరిస్థితుల ప్రభావంతో డ్రాపవుట్ల సమస్య కూడా వెన్నాడుతోందని తెలిపింది. అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 2011 జనగణనలో 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఇటీవల నేషనల్ ఎచీవ్మెంటు సర్వే (ఎన్ఎస్) జరిగింది. 2011 నుంచి గత ఏడాది వరకు పాఠశాలల్లో చేరికలను ఎన్ ఎస్ వెల __డించింది. ఈ గణాంకాలను ఎన్ సీఈఆర్టీ విశ్లేషించింది. సామాజిక చైతన్యం ఉన్న రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గుతు న్నట్లు వెల్లడించింది. ఆ కారణంగా పాఠశాలల్లో చేరికల్లో కూడా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఎన్సీఈఆర్టీ అధ్యయనం ప్రకారం.. 2025 నాటికి పాఠశాలల్లో చేరికలు 14 శాతానికి పైగా తగ్గుతాయని అంచనా. బాలురకంటే బాలికల చేరికల సంఖ్య మరింత తక్కువగా ఉంటుందని.. పేర్కొంది. ముఖ్యంగా 6 16 ఏళ్ల లోపు వయసు పిల్లలు విద్యాలయాలకు వెళ్లే సంఖ్య తక్కువగా ఉంటుందని పేర్కొంది. అప్పర్ ప్రైమరీ దశలో చేరికల నమోదు 2016. నుంచి క్రమంగా తగ్గుతోంది. 2011 నుంచి ఇప్పటివరకు మొత్తంగా చేరికల్లో 9.47 శాతం మేర తగ్గినట్లు తేలింది. దీనిలో బాలురు 8.07 శాతం కాగా బాలికలు 10.94 శాతం గా ఉంది. 2025 నాటికి మొత్తం చేరికల తగ్గుదల 14.37గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాలుర నమోదు 13:28. శాతం, బాలికల నమోదు 15.54 శాతం మేర తగ్గుతుందని ఎన్సీఈఆర్టీ వివరించింది.

వలంటీర్ల సేవలకు మరో ఏడాది పొడిగింపు

అమరావతి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డ్‌ సచివాలయాలల్లో పనిచేస్తున్న 2.60 లక్షల వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ గ్రామ, వార్డ్‌ సచివాలయాలశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ఎంపిక చేసిన వలంటీర్ల గడువు ఈ ఏడాది ఆగస్టు 15తో ముగియడంతో ప్రభుత్వం వారి సర్వీసును వచ్చే ఏడాది ఆగస్టు 14 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. వలంటీర్లకు ప్రభుత్వం ఏటా రూ.1560 కోట్లు గౌరవ వేతనాలను అందిస్తోంది.

మినిమం టైం స్కేల్‌ ఇవ్వలేం

సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై తేల్చేసిన ప్రభుత్వం
సమగ్రశిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేసే కేజీబీవీ ఉపాధ్యాయులు, క్రాఫ్ట్‌, ఆర్ట్‌ టీచర్లు, సీఆర్‌పీలకు మినిమం టైమ్‌ స్కేలు(ఎంటీఎస్‌) ఇవ్వలేమని ప్రభుత్వం తేల్చేసింది. ఇంతకాలం వారందరికీ ఎంటీఎస్‌ అమలుచేస్తామని హామీలు ఇస్తూ, రెండు జీవోలు కూడా జారీచేసిన ప్రభుత్వం ఇప్పుడు కుదరదని స్పష్టంచేసింది. సమగ్ర శిక్ష ప్రాజెక్టు పరిధిలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమాఖ్య పిలుపుమేరకు ఉద్యోగులు శుక్రవారం సమగ్రశిక్ష కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. కార్యాలయం గేటు వద్ద నిరసన వ్యక్తంచేశారు. దీంతో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌, సమగ్ర శిక్ష ఇన్‌చార్జ్‌ ఎస్పీడీ సురే్‌షకుమార్‌ వారితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రమే ఎంటీఎస్‌ వర్తిస్తుందని, ప్రాజెక్టు పరిధిలోని ఉద్యోగులకు వర్తించదని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయంగా జీతాల పెంపునకు ఇతర ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చారు. ఎంటీఎస్‌ ఇవ్వలేనప్పుడు 2020లో జీవో 40, 2022లో జీవో 5 ఎందుకు జారీచేశారని ఉద్యోగులు కమిషనర్‌ను ప్రశ్నించగా, ఆ జీవోలు ఆర్థిక శాఖ ఇచ్చిందని, ఎంటీఎస్‌ సాధ్యం కాదని ఆయన తేల్చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25వేల మంది ఇంతకాలం జగన్‌ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఈ ఆందోళనలో సమాఖ్య అధ్యక్షుడు ఎం.బాలకాశి, కార్యదర్శి కాంతారావు, దేవేంద్ర, కె.విజయ్‌ పాల్గొన్నారు

పండగ పూట ఈఎంఐల మంట

రెపో రేటు 0.5 శాతం పెంచిన రిజర్వు బ్యాంకు
2019 ఏప్రిల్‌ తర్వాత గరిష్ఠ స్థాయికి చేరిక
గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియం
కార్పొరేట్ల రుణ సమీకరణ భారమూ పెరిగే ముప్పు
వరుసగా నాలుగు విడతల్లో 1.9 పెరిగిన రెపో రేటు
వృద్ధిరేటు అంచనాలో కోత.. ద్రవ్యోల్బణం యథాతథం
ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ అగ్రిగేటర్లూ ఇక ఆర్బీఐ పరిధిలోకి
ఆర్థికవ్యవస్థలో లిక్విడిటీ తగ్గుతుందనే భయాలు వద్దు
5 లక్షల కోట్ల నిధులు ఉన్నాయి: ఆర్బీఐ గవర్నర్‌
ఈ నిర్ణయం వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు మరింత ప్రియం కానున్నాయి. దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు గత మూడు విడతలుగా రెపో రేటును పెంచుతూ వస్తున్న ఆర్బీఐ.. వరుసగా నాలుగోసారి కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో మొత్తమ్మీద రెపో రేటు 1.9 శాతం మేర పెరిగి 5.9 శాతానికి చేరుకుంది


Previous Post Next Post

Contact Form