పీటీడీ సిబ్బందికి వేతన సవరణ అమలు
అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందికి వేతన సవరణ అమల్లోకి వచ్చింది. 48వేల పీటీడీ సిబ్బందికి పెరిగిన జీతాలు ఈ నెల 1న చెల్లించింది. పదోన్నతులు పొందిన 2095 మందికి మరో నెల వాయిదా వేసిం ది. కాగా, ప్రభుత్వంలో విలీనమై పీటీడీ సిబ్బందిగా మారిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవి ఆర్టీసీ సిబ్బందికి వర్తింపజేయలేదు. దీనిపై గతంలో సంఘాలు పలుమా ర్లు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
6 వారాల్లో బకాయిలతో సహా చెల్లించాలని స్పష్టీకరణ
ఒకే పనికి వేతన వ్యత్యాసం బానిసత్వాన్ని ప్రోత్సహించటమే: హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు హైకోర్టులో ఊరట లభించింది. నూతన పీఆర్ సీ (2022) ప్రకారం వారికి కనీస వేతనాలు అమలు చేయాలని తీర్పునిచ్చింది. వేతన బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని కూడా ఆదేశించింది. కనీస వేతన స్కేల్స్కు తాము అర్హులమైనా అమలు చేయటంలేదని మరోవైపు బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నందున జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాల్సిందిగా కేజీబీవీల్లో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్టు రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే మన్మధరావు విచారణ జరిపిన అనంతరం తీర్పును వెలువరించారు. పిటిషనర్ల తరుపున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. వేతన సవరణ ప్రకారం పిటిషనర్లకు కనీసవేతనాలు అమలు చేయటంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రెగ్యులర్ టీచర్లు నిర్వహించే విధంగానే వారు విధులు నిర్వర్తిస్తున్నారని అయితే వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉందన్నారు. కనీస వేతనాలకు ప్రభుత్వం < ఉత్తర్వులు జారీచేసినా అధికారులు అమలు చేయటంలేదన్నారు. జగ్జిత్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్ జోక్యం చేసుకుంటూ జీవో 40 ప్రకారం మంజూరైన పోస్టుల్లో నియమితులైన వారికే కనీస వేతన నిబంధన వర్తిస్తుందన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు ఉద్యోగులైనందున వారికి వర్తించదని చెప్పారు. వివిధ సొసైటీల ద్వారా ఏడాది కాంట్రాక్టు ఒప్పందంతో వారు నియమితులయ్యారని అందుకు ప్రతిగా గౌరవ వేతనం పొందుతున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఒకేరకమైన విధులు నిర్వర్తిస్తున్న వారికి వేర్వేరు వేతనాలను అమలు చేయటం సమంజసం కాదన్నారు. ఇది బానిసత్వాన్ని, దోపిడీని ప్రోత్సహించటమే అవుతుందని తీర్పులో వ్యాఖ్యానించారు. ఇది ఉద్యోగుల గౌరవానికి కూడా భంగకరమన్నారు. ఇప్పటికే చాలా మంది కేజీబీవీ టీచర్లు బదిలీ కావటం, కొత్తపోస్టుల్లో చేరినందున వారిని కదల్చరాదని తీర్పునిచ్చారు. బదిలీలపై ఇప్పటికే స్టే మంజూరు చేశామని ఇది యథాతథంగా కొనసాగుతుందని కోర్టుకు వచ్చిన వారి విషయంలో స్పష్టం చేశారు. పీటిషనర్లయిన టీచర్లు ప్రస్తుతం పనిచేస్తున్నచోటే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది.
ఆంద్రప్రభ: ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి లోబడి ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను చేయడం సహజ విధానమని, దీనికి భిన్నంగా హక్కుల రక్షణకు ఉద్యమాలను చేస్తున్న ఉపాధ్యాయులపై అక్రమ కేసులు < పెట్టడాన్ని యుటియఫ్ మధ్యంతర కౌన్సిల్ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు > యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. యుటియఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ ఎం.బి.వి.కె. విజయ వాడలో అక్టోబర్ 1,2 తేదీలలో జరుగుతున్నాయి. మొదటి రోజు పలు అంశాలపై చర్చించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ని అమలు చేయాలని పోరాటం చేస్తే ఉద్యోగ, ఉపాధ్యా యులపై అక్రమ కేసులు పెట్టడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. ఉద్యమ చరిత్రలో వేలాది మంది ఉపాధ్యాయుల మీద ఇలా కేసులు పెట్టిన చరిత్ర లేదని విమర్శించారు. కేసులు పెట్టడం ద్వారా, నిర్బంధాలను ప్రయోగించడం ద్వారా ఉద్యమాలను అణిచివే "యడం అసాధ్యమనే విషయం ప్రభుత్వం గమనించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమాలపై నిర్బంధాలను ఆపి, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేసారు.
ఆ రెండు కోర్సులకే డిమాండ్
సీఎస్ఈ, ఐటీ తర్వాత ఒక మాదిరి ఎలక్ట్రాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగంలో చేరేందుకు విద్యార్ధులు ఆసక్తి చూపారు.. దీనితరువాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విభాగంలోనూ ప్రవేశాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. కొవిడ్ తర్వాత సాఫ్ట్ వేర్ కొలువులకు మళ్లీ భూమ్ వచ్చినట్లు అయింది. సీఎస్ఈ, ఐటీ కోర్సులు చదివిన వారికే రెండేళ్ల నుంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో ఈ రెండు బ్రాంచిల్లో చేరటానికి విద్యార్థులు పోటీపడుతున్నారు. సాధ్యమైనంతవరకు ప్రతి కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఉన్న సీట్లన్నీ మొదటి విడత కౌన్సెలింగ్లోనే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఐటీ బ్రాంచికి బాగానే విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవటంతో ఈ బ్రాంచిలో సీట్లు మొదటి విడత కౌన్సెలింగ్లోనే 90 శాతం భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలు ఉండటం ఇవి చదివిన వారికి ప్రస్తుతం మార్కెట్లో ఉద్యోగావకాశాలు బాగా ఉండటంతో ఈసారి అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచిని ఎంపిక చేసుకున్నారని ఆయా కళాశాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు చెబుతున్నారు. కన్వీనర్, యాజమాన్య కోటాల్లోని సీట్లు మొదటి విడతలోనే అయిపోయాయి. అయితే ఈ బ్రాంచిల్లో సీట్లు వచ్చినా కొందరు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో రాలేదని, కొందరు తాము రెండో విడత కౌన్సెలింగ్కు వెళతామని కండిషనల్ జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మొదటి విడతలో సీట్లు వచ్చి వారు అనుకున్న కళాశాలలో సీటు రాకపోతే తొలుత జాయినింగ్ రిపోర్టు ఇచ్చి ఆ వెంటనే తాము సెకండ్ కౌన్సెలింగ్ వరకు వేచి చూస్తామని రాతపూర్వకంగా లేఖ అందజేస్తే వారికి సీటు ఉంటుంది. అలా కాకుండా తమకు మొదటి విడతలోనే సీటు కేటాయించారు కదా అని చెప్పి రిపోర్టు చేయకుండా ఉంటే ఆ సీటు ఆటోమెటిక్ గా రద్దు అవుతుంది. దాన్ని తిరిగి రెండో కౌన్సెలింగ్కు క్లియర్ వెకెన్సీగా చూపుతారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో మొత్తం 1.50 లక్షలకుపైగా పలు విభాగాలకు సంబంధించిన సీట్లు ఉన్నాయి. వాటిలో 30 శాతం వరకూ సీఎస్సీ సీట్లు, 20 శాతం వరకూ ఐటీ సీట్లు, ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా మొదటి విడత కౌన్సిలింగ్లోనే భర్తీ అవడం ఈ ఏడాది విశేషంగా చెప్పుకోవచ్చు.
టాప్ 10 కోర్సులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో 10 కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో కంప్యూటర్ సైన్స్ 351 కళాశాలల్లోనూ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 344, మెకానికల్ 307, సివిల్ 302, ఎలక్ట్రికల్ 289, ఈసీఈ 147, ఐటీ 70, అగ్రికల్చర్ 20, కెమికల్ 18, ఇన్స్ట్రుమెంటేషన్ 10 కళాశాలల్లోనూ ఉన్నాయి. వీటిలో ఈసారి కంప్యూటర్, ఐటీ రంగాలకు చెందిన కోర్సులకు విద్యార్థుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఆతరువాతి స్థానంలో ఈసీఈ, ఈఈఈలకు ఆదరణ ఉంది. ఇక మెకానికల్ కోర్సుకు ఆదరణ ఎప్పుడూ స్థిరంగానే ఉంటూ వస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆందోళనకర పరిస్థితి
పిల్లలను గుర్తించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు లేఖ
పేదరికం కారణంగా ఏ తల్లీ తన పిల్లలను బడికి పంపలేని దుస్థితి రాకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్స్ ను తగ్గించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి అమలు చేస్తున్నాం.
▪️-సీఎం జగన్మోహన్రెడ్డి
గతేడాదితో పోల్చితే ఈసారి 2.25 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారు (డ్రాపౌట్), ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖలోని ఇతర ఉద్యోగుల ప్రయత్నాలతో 52 వేల మంది తిరిగి చేరారు. మిగతా 1.73 లక్షల మందిని గుర్తించి, బడికి తీసుకురావాలని పాఠశాల విద్య కమిషనర్ కోరారు'
▪️-కలెక్టర్లకు రాసిన లేఖలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్
ఈనాడు, అమరావతి: అమ్మబడి, విద్యా కానుక పథ కాల కారణంగా బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గిం దని, సర్కారు బడులకు వచ్చే వారు పెరిగారని ప్రభుత్వం ఇంతవరకు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. 2021-22 విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది 2.25 లక్షల మంది బడి మానేసి నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొందరు ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చేసిన కృషితో 52 వేల మంది వెనక్కి వచ్చారు. ఇంకా1.73 లక్షల మంది వివరాలు తెలియరాలేదు. వీరిలో ప్రాథమిక పాఠశాల నుంచి పదో తరగతి వరకు ఉన్నారు. జులై 5వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారం.. భమయ్యాయి. ఈ లెక్కన 80 రోజులకు పైగా ఇన్ని లక్షల మంది బడులకు రావడం లేదు. దాంతో ఇలాంటి పిల్ల లను గుర్తించి, వారిని తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవా లంటూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది. ఈ మేరకు విద్య, సంక్షేమ సహాయకులు, గ్రామ, వార్డు వాలంటీర్ల సాయం తీసుకో వాలని కలెక్టర్లకు సంబంధిత డైరెక్టర్ శన్మోహన్ ఆదే శాలు జారీ చేశారు. బడిమానేసిన పిల్లల ఇళ్లకు వాలం టీర్లు వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించాలని ఆదేశించారు. 4-14 ఏళ్ల వయస్సులోపున్న పిల్లలందర్నీ బడిలో చేర్పించాలని కలెక్టర్లకు సూచించారు.
వద్దు... వద్దంటున్నా విలీనం
రవాణా సమస్యతో కొందరు విద్యార్థులు బడి మానేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. పిల్ల లకు బడి దూరంగా ఉంటే రావడం మానేస్తారనే విషయం తెలిసినా ప్రభుత్వం ఈ ఏడాది తరగతుల
విలీనం చేసింది. ఇలా చేస్తే డ్రాపౌట్లు పెరుగుతారని ఎంతమంది చెప్పినా వినలేదు. ఇప్పుడదే జరిగింది. మొత్తం 1,79,416 మంది పిల్లల పేర్లు, వారి తల్లిదం డ్రుల ఫోన్ నంబర్లు, వారి పాఠశాలల వివరాలతో సహా విద్యాశాఖ అందించింది. వీటి ఆధారంగా విద్యా ర్డులను గుర్తించాలని వార్డు, గ్రామ సచివాలయాల శాఖను కోరింది. కొందరు సీజనల్ పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని, తల్లిదండ్రులు చదువుకో కపోవడం, విద్యార్థులకు ఆసక్తి లేకపోవడం, కుటుంబ పనులు, ఆరోగ్య సమస్యలతో కొందరు విద్యార్థులు బడి మానేశారని వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 50 కేవీలను . . . ఎంపిక చేసిన కేంద్రం
ఏపీ , తెలంగాణ నుంచి ఒక్కోటి ఎంపిక
అక్టోబర్ 10 వరకూ దరఖాస్తుల స్వీకారం
కేజీబీవీ కాంట్రాక్టు టీచర్లకు కనీస పేస్కేల్
కనీస వేతనాలు ఇవ్వాల్సిందేరాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
6 వారాల్లో బకాయిలతో సహా చెల్లించాలని స్పష్టీకరణ
ఒకే పనికి వేతన వ్యత్యాసం బానిసత్వాన్ని ప్రోత్సహించటమే: హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు హైకోర్టులో ఊరట లభించింది. నూతన పీఆర్ సీ (2022) ప్రకారం వారికి కనీస వేతనాలు అమలు చేయాలని తీర్పునిచ్చింది. వేతన బకాయిలను ఆరు వారాల్లో చెల్లించాలని కూడా ఆదేశించింది. కనీస వేతన స్కేల్స్కు తాము అర్హులమైనా అమలు చేయటంలేదని మరోవైపు బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నందున జోక్యం చేసుకుని తగిన న్యాయం చేయాల్సిందిగా కేజీబీవీల్లో పనిచేస్తున్న పలువురు కాంట్రాక్టు రెసిడెన్షియల్ ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే మన్మధరావు విచారణ జరిపిన అనంతరం తీర్పును వెలువరించారు. పిటిషనర్ల తరుపున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. వేతన సవరణ ప్రకారం పిటిషనర్లకు కనీసవేతనాలు అమలు చేయటంలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. రెగ్యులర్ టీచర్లు నిర్వహించే విధంగానే వారు విధులు నిర్వర్తిస్తున్నారని అయితే వేతనాల్లో భారీ వ్యత్యాసం ఉందన్నారు. కనీస వేతనాలకు ప్రభుత్వం < ఉత్తర్వులు జారీచేసినా అధికారులు అమలు చేయటంలేదన్నారు. జగ్జిత్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమని వాదించారు. ప్రభుత్వ న్యాయవాది కేవీ రఘువీర్ జోక్యం చేసుకుంటూ జీవో 40 ప్రకారం మంజూరైన పోస్టుల్లో నియమితులైన వారికే కనీస వేతన నిబంధన వర్తిస్తుందన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు ఉద్యోగులైనందున వారికి వర్తించదని చెప్పారు. వివిధ సొసైటీల ద్వారా ఏడాది కాంట్రాక్టు ఒప్పందంతో వారు నియమితులయ్యారని అందుకు ప్రతిగా గౌరవ వేతనం పొందుతున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఒకేరకమైన విధులు నిర్వర్తిస్తున్న వారికి వేర్వేరు వేతనాలను అమలు చేయటం సమంజసం కాదన్నారు. ఇది బానిసత్వాన్ని, దోపిడీని ప్రోత్సహించటమే అవుతుందని తీర్పులో వ్యాఖ్యానించారు. ఇది ఉద్యోగుల గౌరవానికి కూడా భంగకరమన్నారు. ఇప్పటికే చాలా మంది కేజీబీవీ టీచర్లు బదిలీ కావటం, కొత్తపోస్టుల్లో చేరినందున వారిని కదల్చరాదని తీర్పునిచ్చారు. బదిలీలపై ఇప్పటికే స్టే మంజూరు చేశామని ఇది యథాతథంగా కొనసాగుతుందని కోర్టుకు వచ్చిన వారి విషయంలో స్పష్టం చేశారు. పీటిషనర్లయిన టీచర్లు ప్రస్తుతం పనిచేస్తున్నచోటే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది.
ఉపాధ్యాయులపై అక్రమ కేసులను ఉపసంహరించాలి
యుటియఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ డిమాండ్ఆంద్రప్రభ: ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి లోబడి ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలను చేయడం సహజ విధానమని, దీనికి భిన్నంగా హక్కుల రక్షణకు ఉద్యమాలను చేస్తున్న ఉపాధ్యాయులపై అక్రమ కేసులు < పెట్టడాన్ని యుటియఫ్ మధ్యంతర కౌన్సిల్ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినట్లు > యుటియఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్.వెంకటేశ్వర్లు, కె.ఎస్.ఎస్. ప్రసాద్ తెలిపారు. యుటియఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్ ఎం.బి.వి.కె. విజయ వాడలో అక్టోబర్ 1,2 తేదీలలో జరుగుతున్నాయి. మొదటి రోజు పలు అంశాలపై చర్చించారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ని అమలు చేయాలని పోరాటం చేస్తే ఉద్యోగ, ఉపాధ్యా యులపై అక్రమ కేసులు పెట్టడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. ఉద్యమ చరిత్రలో వేలాది మంది ఉపాధ్యాయుల మీద ఇలా కేసులు పెట్టిన చరిత్ర లేదని విమర్శించారు. కేసులు పెట్టడం ద్వారా, నిర్బంధాలను ప్రయోగించడం ద్వారా ఉద్యమాలను అణిచివే "యడం అసాధ్యమనే విషయం ప్రభుత్వం గమనించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యమాలపై నిర్బంధాలను ఆపి, ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్ చేసారు.
ఇంజనీరింగ్ విద్యలో కంప్యూటర్ కోర్సుకు డిమాండ్
- ఇంజనీరింగ్ విద్యలో సీఎస్ఈ సీట్లన్నీ తొలి విడత కౌన్సెలింగ్లోనే భర్తీ
- ఆ తరువాత స్థానంలో ఐటీ సీట్లు భర్తీ
- ఆపై ఈసీఈ, ఈఈఈ సీట్లు
- క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు
- ఇంజనీరింగ్ విద్యకు పూర్వ వైభవం
ఆ రెండు కోర్సులకే డిమాండ్
సీఎస్ఈ, ఐటీ తర్వాత ఒక మాదిరి ఎలక్ట్రాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగంలో చేరేందుకు విద్యార్ధులు ఆసక్తి చూపారు.. దీనితరువాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ విభాగంలోనూ ప్రవేశాలు ఒక మోస్తరుగా ఉన్నాయి. కొవిడ్ తర్వాత సాఫ్ట్ వేర్ కొలువులకు మళ్లీ భూమ్ వచ్చినట్లు అయింది. సీఎస్ఈ, ఐటీ కోర్సులు చదివిన వారికే రెండేళ్ల నుంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. దీంతో ఈ రెండు బ్రాంచిల్లో చేరటానికి విద్యార్థులు పోటీపడుతున్నారు. సాధ్యమైనంతవరకు ప్రతి కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో ఉన్న సీట్లన్నీ మొదటి విడత కౌన్సెలింగ్లోనే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఐటీ బ్రాంచికి బాగానే విద్యార్థులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవటంతో ఈ బ్రాంచిలో సీట్లు మొదటి విడత కౌన్సెలింగ్లోనే 90 శాతం భర్తీ అయ్యాయి. కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలు ఉండటం ఇవి చదివిన వారికి ప్రస్తుతం మార్కెట్లో ఉద్యోగావకాశాలు బాగా ఉండటంతో ఈసారి అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచిని ఎంపిక చేసుకున్నారని ఆయా కళాశాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు చెబుతున్నారు. కన్వీనర్, యాజమాన్య కోటాల్లోని సీట్లు మొదటి విడతలోనే అయిపోయాయి. అయితే ఈ బ్రాంచిల్లో సీట్లు వచ్చినా కొందరు విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలల్లో రాలేదని, కొందరు తాము రెండో విడత కౌన్సెలింగ్కు వెళతామని కండిషనల్ జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. మొదటి విడతలో సీట్లు వచ్చి వారు అనుకున్న కళాశాలలో సీటు రాకపోతే తొలుత జాయినింగ్ రిపోర్టు ఇచ్చి ఆ వెంటనే తాము సెకండ్ కౌన్సెలింగ్ వరకు వేచి చూస్తామని రాతపూర్వకంగా లేఖ అందజేస్తే వారికి సీటు ఉంటుంది. అలా కాకుండా తమకు మొదటి విడతలోనే సీటు కేటాయించారు కదా అని చెప్పి రిపోర్టు చేయకుండా ఉంటే ఆ సీటు ఆటోమెటిక్ గా రద్దు అవుతుంది. దాన్ని తిరిగి రెండో కౌన్సెలింగ్కు క్లియర్ వెకెన్సీగా చూపుతారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో మొత్తం 1.50 లక్షలకుపైగా పలు విభాగాలకు సంబంధించిన సీట్లు ఉన్నాయి. వాటిలో 30 శాతం వరకూ సీఎస్సీ సీట్లు, 20 శాతం వరకూ ఐటీ సీట్లు, ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా మొదటి విడత కౌన్సిలింగ్లోనే భర్తీ అవడం ఈ ఏడాది విశేషంగా చెప్పుకోవచ్చు.
టాప్ 10 కోర్సులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో 10 కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో కంప్యూటర్ సైన్స్ 351 కళాశాలల్లోనూ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 344, మెకానికల్ 307, సివిల్ 302, ఎలక్ట్రికల్ 289, ఈసీఈ 147, ఐటీ 70, అగ్రికల్చర్ 20, కెమికల్ 18, ఇన్స్ట్రుమెంటేషన్ 10 కళాశాలల్లోనూ ఉన్నాయి. వీటిలో ఈసారి కంప్యూటర్, ఐటీ రంగాలకు చెందిన కోర్సులకు విద్యార్థుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఆతరువాతి స్థానంలో ఈసీఈ, ఈఈఈలకు ఆదరణ ఉంది. ఇక మెకానికల్ కోర్సుకు ఆదరణ ఎప్పుడూ స్థిరంగానే ఉంటూ వస్తోంది.
కారుణ్య నియామకాలకు సీఎం అనుమతి
- ప్రొబేషన్ కు ముందు చనిపోయినా కారుణ్యం
- ఫైల్ పై సీఎం జగన్ ఆమోదముద్ర
- త్వరలో ఉత్తర్వులు
- ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం వెల్లడి
9 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు
పెడన గ్రామీణం, న్యూస్టుడే: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇంటర్ కళాశాలలకు ఈనెల 2 నుంచి 9వ తేదీవరకు దసరా సెలవులు ప్రకటించినట్లు ఆర్ఎస్ఐవో పి.రవికుమార్ తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గత నెల 22 తో 2022-23 ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ పూర్తయిందని, కళాశాలల యాజమాన్యాలు అన్ని రకాల రికార్డులు సిద్ధం చేసుకోవాలని వివరించారు.నార్మలైజేషన్లో గరిష్ఠం కంటే ఎక్కువ మార్కులు : జేడీ
ఈనాడు, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో నార్మలైజేషన్ చేసినందున నిర్దిష్ట మార్కులు 150కంటే ఎక్కువ వస్తాయని టెట్ సంయుక్త సంచాలకురాలు చంద్రిక తెలిపారు. బహుళ సెషన్స్ పరీక్షలు నిర్వహించే రైల్వే నియామక మండలి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జేఈఈ మెయిన్స్ ల్లోనూ ఈ విధానం అవలంబిస్తున్నారని, నార్మలైజేష న్లో అభ్యర్థులకు గరిష్ఠ మార్కులకంటే ఎక్కువ వచ్చే అవకాశముందని వెల్లడించారు.మళ్లీ తడ 'బడి
ఏకంగా 1.73 లక్షల మంది పిల్లలు డ్రాపౌట్ప్రభుత్వ పాఠశాలల్లో ఆందోళనకర పరిస్థితి
పిల్లలను గుర్తించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖకు లేఖ
పేదరికం కారణంగా ఏ తల్లీ తన పిల్లలను బడికి పంపలేని దుస్థితి రాకూడదని, పాఠశాలల్లో డ్రాపౌట్స్ ను తగ్గించాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి అమలు చేస్తున్నాం.
▪️-సీఎం జగన్మోహన్రెడ్డి
గతేడాదితో పోల్చితే ఈసారి 2.25 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారు (డ్రాపౌట్), ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖలోని ఇతర ఉద్యోగుల ప్రయత్నాలతో 52 వేల మంది తిరిగి చేరారు. మిగతా 1.73 లక్షల మందిని గుర్తించి, బడికి తీసుకురావాలని పాఠశాల విద్య కమిషనర్ కోరారు'
▪️-కలెక్టర్లకు రాసిన లేఖలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్
ఈనాడు, అమరావతి: అమ్మబడి, విద్యా కానుక పథ కాల కారణంగా బడి మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గిం దని, సర్కారు బడులకు వచ్చే వారు పెరిగారని ప్రభుత్వం ఇంతవరకు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. 2021-22 విద్యా సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది 2.25 లక్షల మంది బడి మానేసి నట్లు పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. కొందరు ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు చేసిన కృషితో 52 వేల మంది వెనక్కి వచ్చారు. ఇంకా1.73 లక్షల మంది వివరాలు తెలియరాలేదు. వీరిలో ప్రాథమిక పాఠశాల నుంచి పదో తరగతి వరకు ఉన్నారు. జులై 5వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారం.. భమయ్యాయి. ఈ లెక్కన 80 రోజులకు పైగా ఇన్ని లక్షల మంది బడులకు రావడం లేదు. దాంతో ఇలాంటి పిల్ల లను గుర్తించి, వారిని తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవా లంటూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు పాఠశాల విద్యాశాఖ లేఖ రాసింది. ఈ మేరకు విద్య, సంక్షేమ సహాయకులు, గ్రామ, వార్డు వాలంటీర్ల సాయం తీసుకో వాలని కలెక్టర్లకు సంబంధిత డైరెక్టర్ శన్మోహన్ ఆదే శాలు జారీ చేశారు. బడిమానేసిన పిల్లల ఇళ్లకు వాలం టీర్లు వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రేరణ కల్పించాలని ఆదేశించారు. 4-14 ఏళ్ల వయస్సులోపున్న పిల్లలందర్నీ బడిలో చేర్పించాలని కలెక్టర్లకు సూచించారు.
వద్దు... వద్దంటున్నా విలీనం
రవాణా సమస్యతో కొందరు విద్యార్థులు బడి మానేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. పిల్ల లకు బడి దూరంగా ఉంటే రావడం మానేస్తారనే విషయం తెలిసినా ప్రభుత్వం ఈ ఏడాది తరగతుల
విలీనం చేసింది. ఇలా చేస్తే డ్రాపౌట్లు పెరుగుతారని ఎంతమంది చెప్పినా వినలేదు. ఇప్పుడదే జరిగింది. మొత్తం 1,79,416 మంది పిల్లల పేర్లు, వారి తల్లిదం డ్రుల ఫోన్ నంబర్లు, వారి పాఠశాలల వివరాలతో సహా విద్యాశాఖ అందించింది. వీటి ఆధారంగా విద్యా ర్డులను గుర్తించాలని వార్డు, గ్రామ సచివాలయాల శాఖను కోరింది. కొందరు సీజనల్ పనుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారని, తల్లిదండ్రులు చదువుకో కపోవడం, విద్యార్థులకు ఆసక్తి లేకపోవడం, కుటుంబ పనులు, ఆరోగ్య సమస్యలతో కొందరు విద్యార్థులు బడి మానేశారని వెల్లడించింది.
ట్రిపుల్ ఐటీలకు 9 వరకు దసరా సెలవులు
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 9వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించారు. దీంతో ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులందరూ శనివారం ఇంటిబాట పట్టారు. సెలవుల నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులందరూ నేరుగా వారి ప్రాంతాలకు చేరు కునేందుకు గాను ఆర్టీసీ నూజివీడు అధికారులు ట్రిపుల్ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశా రు. దాదాపు 8 వేల మంది విద్యార్థులుండగా వారి కోసం రాజమండ్రి, అమలాపురం, రాజోలు, కాకి నాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు 56 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో ఈ బస్సలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విద్యార్థులను వారి ప్రాంతాలకు తీసుకెళ్లాయి. అయితే దూర ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్లకు వెళ్లారు.ఏపీ బాటలో కేవీలు .. కేంద్రీయ విద్యాలయంలో ‘ బాలవాటిక '
ప్రీ ప్రైమరీ నుంచి విద్యాబోధన ప్రారంభందేశవ్యాప్తంగా 50 కేవీలను . . . ఎంపిక చేసిన కేంద్రం
ఏపీ , తెలంగాణ నుంచి ఒక్కోటి ఎంపిక
అక్టోబర్ 10 వరకూ దరఖాస్తుల స్వీకారం
‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ గడువు పెంపు
మరింత మందికి మేలు చేసేందుకు 30 వరకు పెంచిన ప్రభుత్వంసాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్
సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడు హర్షవర్ధన్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన శనివారం వివరాలు వెల్లడించారు. పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి పేరొందిన యూనివర్సిటీల్లో పెద్ద చదువులు అభ్యసించాలన్న గొప్ప లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ(అగ్రవర్ణ పేదలు), దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇందుకు దరఖాస్తు చేసుకునేలా గత నెల 30 వరకు ప్రభుత్వం గడువిచ్చిందన్నారు. ఇప్పటి వరకు 392 దరఖాస్తులొచ్చాయని, అయితే ఈ పథకంలో మరింత మందికి మేలు చేసే లక్ష్యంతో మరో నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఒకటి నుంచి 200 క్యూఎస్ ర్యాంకులు కలిగిన విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ఒకటి నుంచి వంద క్యూఎస్ ర్యాంకింగ్ కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకున్న విద్యార్థులకు ఫీజు రూ.కోటి అయినా నూరు శాతం రీయింబర్స్‌మెంట్, క్యూఎస్ ర్యాంకుల్లో 101 నుంచి 200లోపు కలిగిన యూనివర్సిటీల్లో సీట్లు తెచ్చుకుంటే రూ.50 లక్షల వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసేలా పథకాన్ని రూపొందించినట్టు వివరించారు.
రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులని చెప్పారు. ఈ పథకంలో ఉన్న నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ఎంతమందికైనా ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇస్తుందని హర్షవర్ధన్ వివరించారు.
Tags
News