ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు
ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయో పరిమితి పెంపు వెసులు బాటును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 సెప్టెంబర్ 27న జారీ చేసిన జీవో 105 ను మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది. 2023 సెప్టెంబర్ వరకు ఈ మినహాయింపు అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీపీఎస్సీ సహా మిగతా ప్రభుత్వ నియామక సంస్థలు ఈ అంశాన్ని నోటిఫై చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అటు ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ -1 ఉద్యోగాలకు మళ్లీ ఇంటర్వ్యూ లు నిర్వహించాలని సర్కారు. నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులిచ్చింది.దసరా సెలవుల్లో క్లాసులు నడిపితే కఠిన చర్యలు
ఇంటర్ బోర్డ్ హెచ్చరిక🌻అమరావతి, ఆంధ్రప్రభ:ప్రయివేట్, అన్ ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీ లు దసరా సెలవుల్లో విద్యార్ధులకు ఎటువంటి క్లాసులు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ బోర్డు హెచ్చరించింది. ఆ కాలేజీల గుర్తింపును రద్దు చేయడంతోపాటు ప్రిన్సిపాల్స్పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈమేరకు ఆదివారం ఇంటర్మీడియట్ బోర్డు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈమేరకు ప్రాంతీయ పర్యవేక్షక అధికారులు కాలేజీలను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఈనెల రెండో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు ఇంటర్ విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువు పెంపు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ అడ్మిషన్ల గడువును ఈనెల 15వ తేదీ వరకు పెంచినట్లు యూనివర్సిటీ స్టడీ సెంటర్ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం. అజంతకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశాలకు ఇంటర్, ఐటీఐ, ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులయిన వారు, పీజీలో ప్రవేశాలకు మూడేళ్ల డిగ్రీ పూర్తిచే సిన వారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరింత సమాచారం కోసం 0866-2434868లో సంప్ర దించాల్సిందిగా ఆయన కోరారు.మండలిని రద్దుచేస్తామంటూ బెదిరించారు
- ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం
- పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించిన యూటీఎఫ్
*ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్య ర్థిగా పి. బాబురెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎం. వెంకటేశ్వర రెడ్డి, ఉమ్మడి కడప, కర్నూలు అనంతపురం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్య ర్థిగా కత్తి నర్సింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల నాగరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కె. రమాప్రభకు యూటీ ఎఫ్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్ తెలిపారు.
మధ్యాహ్న భోజనం తయారీకిచ్చే మొత్తం పెంపు..
రెండేళ్ల తర్వాత 9.60 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం!దేశవ్యాప్తంగా విద్యార్థులకు 'మధ్యాహ్న భోజనం' తయారీలో వంట ఏజెన్సీలకు అందజేసే మొత్తం పెరగనుంది. కొన్నేళ్లుగా ఏటా దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏడు శాతం వంతున పెంచుతోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆ మాటెత్త లేదు. మరోవంక.. ధరల మంట నేపథ్యంలో వివిధ తరగతుల విద్యార్థులకు భోజనం తయారీకి ప్రభు త్వాలు చెల్లించే ధరను పెంచాలని వంట ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నిపు ణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ కొద్ది నెలల క్రితం నివేదికను సమర్పించింది. ఎన్ఐఎన్ మాత్రం 1-5 తరగతుల విద్యార్థులకు రూ.10లు, ఇతరులకు రూ.12లకు పెంచాలని సిఫారసు చేసినట్లు సమా చారం. మొత్తానికి 20 శాతం వరకు పెంచవచ్చని విద్యాశాఖ అధికారులకు సమాచారం ఉంది. అందుకు భిన్నంగా ఇప్పుడు చెల్లిస్తున్న ధరలపై 9.6 శాతం పెంచేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఈ మొత్తంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా భరిస్తాయి.
కొత్త పీఆర్సీ జీతాల్లో భత్యాలకు కత్తెర
ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగుల ఖాతాల్లో నేడో, రేపో వేతన సవరణ (పీఆర్సీ) తో కూడిన కొత్త జీతాలు జమవుతాయి. ఉద్యోగులంతా తమ జీతాలు ఎంత పెరిగాయో నని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొత్త జీతాల్లో భత్యాలను జత చేయకుండా నిలిపేశారు. దీంతో ఓవరైమ్ (ఓటీ)తోపాటు, వివిధ భత్యాల రూపంలో ఉద్యోగులకు దక్కాల్సిన సొమ్ము ఈ నెల జీతాలతో కలిపి రాదని తెలిసింది. మూలవేతనాన్ని చివరి నిమిషంలో ఖరారు. చేయడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఆర్టీసీలో 51,488 మంది ఉద్యో గులుండగా.. వీరందరికీ జూన్ నుంచి కొత్త పీఆర్సీ అమలవుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే పలు కారణాలతో జూన్, జులై, ఆగస్టు జీతాల్లో పీఆర్సీ అమలు చేయలేదు. పదోన్నతులు పొందిన 2,096 మంది మినహా మిగిలిన వారికి.. అక్టోబరులో వచ్చే జీతంలో కొత్త పీఆర్సీ అమలు చేశారు. ఇందులో మూలవేతనం, డీఏ, హెచ్ఎస్ఏ, సీసీఏ తదితరాలే చూపారు. 45 వేల మందికి పైగా ఉద్యోగు లకు లభించే ఓటీ, డే ఔట్, నైట్ ఔట్, నైట్ షిఫ్ట్ భత్యాలు కలపలేదు. దీంతో ఉద్యోగులకు రూ.5-10 వేలు తగ్గనుంది.మూల వేతనం ఖరారులో జాప్యం
ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం మూలవేతనం ఎంతనేది. ఖజానా శాఖ ఖరారుచేసి గత నెల చివర్లో ప్రకటించింది. దీంతో మూల వేతనం ఆధారంగా లెక్కించాల్సిన ఓటీ వివరాలను ఆర్టీసీ అధికారులు ఇవ్వలేకపోయారు. దీనివల్ల ఓటీ, ఇతర భత్యాలను కలపలేదని చెబు తున్నారు. ఈ భత్యాలన్నింటినీ వచ్చే నెల ఇచ్చే జీతంలో కలిపి ఇస్తా మని అంటున్నారు. ఆర్టీసీలో 45 వేల మందికి రావాల్సిన భత్యాలన్నీ కలిపి రూ.4 కోట్ల వరకు ఉంటాయని సమాచారం.
• కొత్త జీతాల పే స్లిప్స్ బయటకు వచ్చాయి. వాటిని గత నెల జీతాలతో పోలిస్తే.. ఎక్కువ మందికి పీఆర్సీ వల్ల పెద్దగా జీతం పెరగలేదని, డీఏ పెంపుతోనే జీతాలు పెరిగాయని చెబుతున్నారు. డీఏ 11.6శాతం నుంచి 20.02 శాతానికి పెంచారు. దీనివల్ల జీతాల్లో పెరుగుదలకనిపిస్తోందని ఉద్యోగులు అంటున్నారు
సీబీఎస్‌ఈపై.. సందేహాలు
- కమిటీ అనుమతిపై అనుమానాలు
- జిల్లాలో 14 పాఠశాలల కోసం ప్రతిపాదనలు
- సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం సౌకర్యాలు అంతంతే
- త్వరలో పరిశీలనకు రానున్న సీబీఎస్‌ఈ కమిటీ సభ్యులు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి సిలబస్ మార్పు జరిగేనా?
దసరాకు పస్తులే!
- ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన అందని జీతాలు
- ఎదురుచూస్తున్న టీచర్లు, పీటీడీ ఉద్యోగులు
- అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదీ అదే పరిస్థితి
ఉమ్మడి విశాఖ జిల్లాలో 12 వేలమంది ఉపాధ్యాయులు, 5,500 మంది ప్రజారవాణా ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. ఇతర శాఖలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మరో 20 వేల మంది వరకు ఉంటారు. వీరిలో టీచర్లు, పీటీడీ ఉద్యోగులు, కార్మికులతోపాటు మరికొన్ని శాఖల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఈనెల ఒకటో తేదీన జీతాలు అందలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒకటో తేదీన జీతాలు రాకపోవడం షరామామూలు వ్యవహారంగా మారిపోయినప్పటికీ, కనీసం దసరా సందర్భంలో కచ్చితంగా జమవుతాయని భావించినా వీరికి నిరాశ ఎదురయింది. ఈ నెల రెండోతేదీ ఆదివారం, సోమవారం దుర్గాష్టమి సెలవులు. మంగళవారం జీతాలు వేస్తే సరి... లేకపోతే ఐదోతేదీ విజయదశమి సెలవు. ఈ నేపథ్యంలో పండగ తరువాతే జీతాలు అందే అవకాశముందని అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరా పండగ ఖర్చులు, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ కంపెనీలకు ఈఎంఐలు చెల్లించేందుకు తీవ్ర అవరోధం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్ణీత తేదీలోగా ఈఎంఐ చెల్లించకపోతే అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.
మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు
జీతాల బట్వాడాలో ప్రతినెలా జాప్యం నెలకొంటుండడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రతిరోజూ కచ్చితమైన సమయానికి పాఠశాలకు వెళ్లాలని, తమ సొంత ఫోన్లలోనే ఫేషియల్ యాప్ ద్వారా హాజరు వేయాలని షరతులు విధించిన ప్రభుత్వం, ఒకటో తేదీనే జీతాలు ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి.
కరిగిన కాలం .. పరీక్షలే ప్రశ్నార్థకం
ఏటా జూన్ రెండో వారం లోపు విద్యాసంవత్సరం ప్రారంభం కావడం ఆనవాయితీ . రెండేళ్లుగా ఇది మారింది . 2021-22 విద్యాసంవత్సరంలో కరోనా కారణంగా నవంబరు నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి . ఈ ఏడాది మూడు వారాలు ఆలస్యంగా జులై 5 తేదీ విద్యాసంవత్సరం ఆరంభమైంది . ప్రస్తుతం విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు . వారం రోజుల తరువాత పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి . ఇంతవరకు చెప్పిన పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఏమేరకు పట్టు వచ్చిందో తెలుసుకోవడానికి ఒక్క పరీక్ష కూడా జరగకపోవడం విశేషం . ఏటా నాలుగు యూనిట్ టెస్టులు ( ఒక్కోటి 25 మార్కుల వంతున ) నిర్వహించేవారు . త్రైమాసిక ( దసరా ) , అర్ధసంవత్సరం ( సంక్రాంతి ) , ఏప్రిల్లో వార్షిక పరీక్షల నిర్వహణతో విద్యా సంవత్సరం ముగుస్తోంది .ఆబ్జెక్టివ్ , ఓఎంఆర్ రూపంలో ..
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు 20 మార్కులకే యూనిట్ టెస్టులను పరిమితం చేశారు . అందులోనూ ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 15 మార్కులు , మరో ఐదు మార్కులకు వ్యాసరూప ప్రశ్న ఇచ్చేలా ప్రశ్నపత్రం రూపొందిస్తున్నారు . ఈ ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు కూడా ఓఎంఆర్ షీట్లపైనే సమాధానాలు రాయాలి . పెద్ద పెద్ద పోటీ పరీక్షలకు మాదిరి బబ్లింగ్ చేసే క్రమం బాల్యం నుంచే అలవరుస్తుండడం గమనార్హం . దీంతో జిజ్ఞాస , భావ వ్యక్తీకరణకు తావివ్వక చిన్నతనం నుంచే లక్కీ డ్రా మాదిరిగా ఏదో ఒకటి తగలకపోతుందా అనే ధోరణి ఏర్పడుతుంది .
ప్రామాణికాల కోసమే- ప్రతాప్ రెడ్డి , డైరెక్టర్ , రాష్ట్ర విద్యా శాఖ రిసోర్స్ ట్రైనింగ్ సెంటర్
ప్రామాణికాల కోసమే పరీక్షా మార్పులు తీసుకొచ్చాం . యూనిట్ విధానంలో టెస్ట్ల స్థానంలో ఫార్మెటివ్ అసిస్మెంట్ పద్దతి తీసుకొ స్తున్నాం . దసరా సెలవుల అనంతరం ఈ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేస్తాం . కొన్ని సబ్జెక్ట్ కు బేస్లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నాం .
యూనిట్ టెస్టులేవీ ?
గతంలో దసరా సెలవులు ఇచ్చే లోపే జులైలో తొలి , ఆగస్టులో మలి యూనిట్లు సహా త్రైమాసిక పరీక్షలు పూర్తయ్యేవి . ఈ సారి త్రైమాసికం కాదు కదా యూనిట్ పరీక్షలు కూడా నిర్వహించలేదు . గత ఏడాది కరోనా కారణంగా నాలుగుకి బదులుగా మూడు యూనిట్ టెస్టులు నిర్వహించారు . ప్రస్తుతం యూనిట్ పరీక్షలను ఫార్మెటివ్ అసెస్మెంట్ 1,2,3,4 లుగా మార్చారు . త్రైమాసిక పరీక్షలను సమ్మెటివ్ అసిస్మెంట్ -1 , అర్ధ సంవత్సర పరీక్షలను సమ్మెటివ్ అసిస్మెంట్ -2 గా మార్చారు .
Tags
News